Pawan Kalyan : తప్పు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారు?- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు-dy cm pawan kalyan sensational comments on ys jagan tirumala laddu adulteration issues ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Pawan Kalyan : తప్పు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారు?- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

Pawan Kalyan : తప్పు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారు?- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

Sep 22, 2024, 03:21 PM IST Bandaru Satyaprasad
Sep 22, 2024, 03:21 PM , IST

  • Pawan Kalyan On Tirumala Laddu : తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్యని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్లు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.

తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే మహాప్రసాదం లడ్డూను కల్తీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూకు వినియోగించిన నెయ్యిలో బీఫ్ ఫ్యాట్, పంది కొవ్వు, చేప నూనె, సోయా, సన్ ఫ్లవర్ లాంటి ఇతర నూనెలు ఉన్నట్లు ఎన్ఏడీబీ సీఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. 

(1 / 9)

వైసీపీ పాలన కాలంలో ఇలాంటి నేతిని వినియోగించి తయారు చేసిన లక్ష లడ్డూలను శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి తిరుమల తిరుపతి దేవస్థానం పంపి చాలా పెద్ద తప్పు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. హిందువులు మహాప్రసాదంగా భావించే లడ్డూకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని,  ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి దీన్ని ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. దీనిపై కేబినెట్, అసెంబ్లీలో చర్చించి దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. 

(2 / 9)

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నిర్థారణ అయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లాలోని నంబూరులో ఉన్న శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయానికి  ఆదివారం ఉదయం వెళ్లి దీక్ష తీసుకున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన నేపథ్యంలో క్షమించమని వెంకటేశ్వర స్వామిని కోరుతూ ఆయన దీక్ష మాలధారణ తీసుకున్నారు. 

(3 / 9)

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “తిరుమలను హిందువులు పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా భావిస్తారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సంస్కరణల పేరుతో చాలా మార్పులు చేసింది. స్వామివారి పూజా విధానాలను మార్చేశారు. శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10 వేలు వసూలు చేశారు. ఐదుగురు కుటుంబ సభ్యులు స్వామివారి దర్శనానికి వస్తే రూ.50 వేలు వసూలు చేసి బిల్లు మాత్రం రూ. 500 చొప్పునే ఇచ్చారు. నాతోపాటు చాలా మంది రాజకీయ నాయకులు దీనిపై ప్రస్తావించాం. తప్పు జరుగుతుందని వేలెత్తి చూపినా వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు' అని విమర్శించారు. 

(4 / 9)

వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అవకతవకలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందన్నారు. శ్రీవారి లడ్డూను హిందువులు మహాప్రసాదంగా భావిస్తారని, ఆ మహా ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని, దారుణం ఏమిటంటే శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి ఇదే నెయ్యితో చేసిన లక్ష లడ్డూలు పంపించారన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కూడా ప్రసాదాల నాణ్యతపై చర్చ జరుగుతోందన్నారు. 

(5 / 9)

తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా జగన్ వారిని ఎలా సమర్థిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కోట్ల మంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారు. చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలం అయిపోయేదన్నారు. ప్రపంచం అంతా మాట్లాడేది. గ్లోబల్ న్యూస్ అయ్యేదన్నారు. అదే హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? సెక్యూలర్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందా? హిందువులకు మనోభావాలు ఉండవా? ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామన్నారు.  

(6 / 9)

"మాజీ సీఎం జగన్ ను సూటిగా అడుగుతున్నాను. తిరుమలలో జరిగిన విధంగా ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఊరుకుంటారా? ఒక మసీదుకు జరిగితే ఊరుకుంటారా?  తిరుమలలో అపవిత్రం జరిగితే ఎందుకు మాట్లాడకూడదు అంటున్నారు? మేము మాట్లాడతాం, మేము హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం మీద దాడి జరిగినా మాట్లాడతాం, సనాతన ధర్మంపై దాడి జరిగినా మాట్లాడుతాం.  తిరుమల ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే"- పవన్ కల్యాణ్ 

(7 / 9)

తిరుమలో ప్రతి రోజు దాదాపు 15 వేల కిలోల నెయ్యి వినియోగిస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక కిలో నెయ్యి తయారీకి దాదాపు రూ.వెయ్యి ఖర్చవుతుందన్నారు.  అలాంటిది రూ.360కే వస్తుందని ఒక మధ్యవర్తి చెబితే క్వాలిటీ చెక్ చేయకుండా ఎలా తీసుకుంటారని, స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు, బోర్డు సభ్యులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైసీపీ అంటే భయమా? లేక సుబ్బారెడ్డి అంటే భయమా?  ఉద్యోగులు మౌనంగా ఉండి మహా అపరాధం చేశారని మండిపడ్డారు. ఈ అపరాధంతో నాకు సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంటున్నానన్నారు.  

(8 / 9)

 ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఇవాళ మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు సమావేశం అయ్యారు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియచేశారు. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు