తెలుగు న్యూస్ / ఫోటో /
Putrada Ekadashi 2024: పిల్లల శ్రేయస్సు కోసం పుత్రద ఏకాదశి రోజు ఈ పనులు చేయండి!
ఈ ఏడాది శ్రావణ పుత్రద ఏకాదశి పర్వదినం రేపు (ఆగస్టు 16) ఉండనుంది. పిల్లల శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు ఈరోజున కొన్ని పనులను ఆచరించడం మంచిది. ఆ వివరాలివే.
(1 / 7)
ఏడాదిలో పుత్రద ఏకాదశి… పుష్య, శ్రావణ మాసాల్లో వస్తోంది. శ్రావణ మాస పుత్రద ఏకాదశి రేపు (ఆగస్టు 16) ఉంది. సంతానం కలగడం కోసం, పిల్లల శ్రేయస్సు కోసం ఈరోజున కొన్ని పూజలు, కార్యాలు చేస్తే మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంది.
(2 / 7)
పుత్రద ఏకాదశి ఉన్న ఆగస్టు 16 రోజునే ప్రీతియోగం కూడా ఉంది. పిల్లల క్షేమం, శ్రేయస్సు కోసం ఈరోజున తల్లిదండ్రులు కొన్ని పనులు ఆచరిస్తే మేలు జరుగుతుంది.
(3 / 7)
పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి.. విష్ణు సహస్ర పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. పిల్లల జీవితాల్లో సంతోషం, సౌభాగ్యం పెరుగుతాయి.
(4 / 7)
పుత్రద ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పసుపు రంగులో ఉండే పూలను మాలగా సమర్పించండి. వాటిపై గంధపు తిలకం కూడా పూయండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఒత్తిడి తగ్గుతుందనే విశ్వాసం ఉంది. పిల్లల చదువులో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయనే నమ్మకం ఉంది.
(5 / 7)
పుత్రద ఏకాదశి రోజున విష్ణు మంత్రాన్ని 108సార్లు చదవండి. ఇలా చేయడం వల్ల పిల్లల జీవితంలో సంతోషం నెలకొంటుందనే నమ్మకం ఉంది.
(6 / 7)
పుత్రద ఏకాదశి రోజున ఉపవాసం ఉండి సంతాన గోపాల మంత్రాన్ని పఠించాలి. ఇది శిశువులకు మేలు చేస్తుంది.
ఇతర గ్యాలరీలు