Raksha Bandhan Timings : ఈ సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి.. 2 అశుభ సమయాలు!-do not tie rakhi during these 2 bad times know raksha bandhan 2024 right time auspicious time to tie rakhi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Raksha Bandhan Timings : ఈ సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి.. 2 అశుభ సమయాలు!

Raksha Bandhan Timings : ఈ సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి.. 2 అశుభ సమయాలు!

Aug 18, 2024, 03:58 PM IST Anand Sai
Aug 18, 2024, 03:58 PM , IST

Raksha Bandhan 2024 Timings : ఆగస్టు 19 న రక్షా బంధన్. అయితే ఏ సమయంలో రాఖీ కట్టాలో కూడా తెలుసుకోవాలి. కొన్ని అశుభ సమయాల్లో రాఖీ కట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఈ సంవత్సరం రక్షా బంధన్‌ రోజున అనేక శుభకార్యాలు జరుగుతాయి. రక్షా బంధన్ రోజు శ్రావణ పౌర్ణమి. రక్షా బంధన్ పండుగ ఆగష్టు 19న జరుపుకొంటారు. భద్ర కాలం 7 గంటల 39 నిమిషాలు ఉంటుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని భద్ర నీడ పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో చేసిన పని సత్ఫలితాలను ఇవ్వదని విశ్వాసం ఉంది. రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోండి.

(1 / 6)

శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19, సోమవారం తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19 సోమవారం రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది.

(2 / 6)

ఈసారి రక్షా బంధన్ భద్ర నీడగా ఉంటుంది. ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు భద్ర ఉంటుంది.

(3 / 6)

హిందూమతంలో ఏదైనా పని చేయడానికి ముందు శుభ దినాలు, శుభ సమయాలు చూస్తారు. భద్ర కాలం ప్రారంభమైనప్పుడు అశుభ సమయం ప్రారంభమవుతుంది. భద్ర శనిదేవుని సోదరి. హిందూమతంలో భద్ర సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఈ కాలంలో ఏదైనా శుభకార్యం అశుభ ఫలితాలను ఇస్తుంది.

(4 / 6)

రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి సరైన సమయం మధ్యాహ్నం. ఆ రోజు సోదరీమణులు తమ సోదరులకు మధ్యాహ్నం 1:32 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చు.

(5 / 6)

రాఖీ బంధన్ రోజున రాఖీ కట్టేటప్పుడు ఈ రెండు సమయాలను పూర్తిగా విస్మరించాలని నిపుణులు చెబుతున్నారు. మొదటిది భద్ర కాలం, రెండోది రాహుకాలంలో కట్టకూడదు. ఈ రెండు కాలాలు అశుభమైనవిగా అంటారు. ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు భద్రకాలం ఉంటుంది.  రక్షా బంధన్ రోజున ఉదయం 7.31 నుంచి 9.08 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. మధ్యాహ్నం 1:32 గంటల నుంచి రాత్రి 9:08 గంటల వరకు రాఖీ కట్టుకోవచ్చు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు