తెలుగు న్యూస్ / ఫోటో /
Dizo Watch | భారత్‌లో డిజో వాచ్ 2 స్పోర్ట్స్.. ధర ఎంతంటే..?
రియల్ మీ టెక్లైఫ్ ఎకోసిస్టమ్ కింద బ్రాండ్ డిజో వాచ్ 2కు చెందిన డిజో వాచ్ 2 స్పోర్ట్స్‌ని లాంచ్ చేస్తున్నట్లు డిజో సంస్థ వెల్లడించింది. ఈ వాచ్ పెద్ద డిస్‌ప్లే కలిగి ఉండి.. మల్టీ స్పోర్ట్ ట్రాకింగ్ ఫంక్షనాలిటీ కలిగి అనేక స్మార్ట్ ఫీచర్లతో రానుంది. ఇది 150+ వాచ్ ఫేస్‌లు, వ్యక్తిగతీకరణ ఎంపికలతో పాటు ఆరు రంగులలో వస్తుంది.
రియల్ మీ టెక్లైఫ్ ఎకోసిస్టమ్ కింద బ్రాండ్ డిజో వాచ్ 2కు చెందిన డిజో వాచ్ 2 స్పోర్ట్స్‌ని లాంచ్ చేస్తున్నట్లు డిజో సంస్థ వెల్లడించింది. ఈ వాచ్ పెద్ద డిస్‌ప్లే కలిగి ఉండి.. మల్టీ స్పోర్ట్ ట్రాకింగ్ ఫంక్షనాలిటీ కలిగి అనేక స్మార్ట్ ఫీచర్లతో రానుంది. ఇది 150+ వాచ్ ఫేస్‌లు, వ్యక్తిగతీకరణ ఎంపికలతో పాటు ఆరు రంగులలో వస్తుంది.
(1 / 6)
అసలు ధర రూ. 2,499, డిజో వాచ్ 2 స్పోర్ట్స్ కొనుగోలు కోసం మార్చి 08, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో పరిచయ ఆఫర్‌గా రూ. 1,999కే రానుంది. స్మార్ట్ వాచ్ దానితో పాటు రిఫ్రెష్ చేయబడిన ఫ్రేమ్‌ను తెస్తుంది. అంతే కాకుండా సిల్వర్ గ్రే, ఓషన్ బ్లూ, ప్యాషన్ రెడ్, డార్క్ గ్రీన్, గోల్డెన్ పింక్, క్లాసిక్ బ్లాక్‌లలో అందుబాటులోకి రానుంది.(Priya/HT Tech)
(2 / 6)
డిజో వాచ్ 2 స్పోర్ట్స్ 1.69-ఇన్ (4.3 సెం.మీ.)ని కలిగి ఉంటుంది. 600నిట్స్‌తో అతిపెద్ద డిస్‌ప్లే స్క్రీన్ కలిగి ఉంది. పైగా వాచ్ బరువు కేవలం 41.5 గ్రాములు మాత్రమే. ఇది డైనమిక్ డయల్ బ్యాక్‌గ్రౌండ్, పర్సనలైజేషన్ ఆప్షన్‌తో సహా 150+ వాచ్ ఫేస్‌లను కూడా అందిస్తుంది. ఇది వినియోగదారుల రోజు వారి దుస్తులకు అనుగుణంగా ఉంటుంది.(Priya/HT Tech)
(3 / 6)
ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం, డిజో వాచ్ 2 స్పోర్ట్స్ 110+ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఎలిప్టికల్, యోగా, క్లైంబింగ్, హాకీ, ఫుట్‌బాల్, గుర్రపు స్వారీ, హై/లాంగ్ జంప్, అనేక నృత్య రూపాలు, తాయ్ చి, మార్షల్ ఆర్ట్స్, ట్రామ్పోలిన్ మొదలైన మోడ్లలో రూపొందించారు. ఇది ఫిట్‌నెస్ రికార్డ్‌లను సులభంగా ఉంచడం కోసం వారపు, నెలవారీ, వార్షిక కార్యాచరణ డేటాను ట్రాక్ చేస్తుంది. 5ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్‌తో సర్టిఫికేట్ చేశారు. కాబట్టి ఇది వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, స్నానం, వాషింగ్ మొదలైన వాటిలో మీతో భాగస్వామిగా ఉంటుంది. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, స్మార్ట్ వాచ్ ఎస్పీఓ2, 24x7 హృదయ స్పందన రేటు, నిద్ర పర్యవేక్షణ, వాటర్ రిమైండర్, సెడెంటరీ రిమైండర్‌లను అందిస్తుంది. దీనిలో మహిళ ఋతు చక్రం కూడా ట్రాక్ చేయవచ్చు.(Priya/HT Tech)
(4 / 6)
స్మూత్ స్క్రోలింగ్ ఫీచర్‌తో పాటు, మెసేజ్‌తో కాల్‌లను తిరస్కరించడం/మ్యూట్ కాల్‌లు, మ్యూజిక్ కంట్రోల్, కెమెరా కంట్రోల్, ఫైండ్ మై ఫోన్, స్మార్ట్ నోటిఫికేషన్, అలారం, రిమైండర్, స్టెప్ గోల్ కంప్లీషన్ రిమైండర్ వంటి స్మార్ట్, అప్‌గ్రేడ్ ఫీచర్లతో కూడా ఛార్జ్ చేయబడుతుంది.(Priya/HT Tech)
(5 / 6)
స్మార్ట్‌వాచ్ 260ఏఎంహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి 10 రోజుల వరకు ప్రామాణిక వినియోగాన్ని అందిస్తుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి రెండు గంటల సమయం పడుతుంది. గరిష్టంగా 20 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదు. ఇది బ్లూటూత్ వి5.0 కనెక్టివిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 9.0, అంతకంటే ఎక్కువ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో సులభంగా కనెక్ట్ చేయబడుతుంది.(Priya/HT Tech)
(6 / 6)
ఫీచర్లతో ప్రీలోడెడ్ అయిన సరికొత్త డిజో యాప్ మద్దతుతో, డిజో వాచ్ 2 స్పోర్ట్స్ గొప్ప యూఐ అనుభవాన్ని అందిస్తుంది. కాల్‌లకు (ఆండ్రాయిడ్ పరికరాల కోసం) శీఘ్ర ప్రత్యుత్తరాలను పంపించేలా డిజో యాప్‌లో త్వరలో అందించనున్నారు. అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌లో జీపీఎస్‌ని ఉపయోగించి నడుస్తున్న మార్గాన్ని కూడా చూడొచ్చు.(Priya/HT Tech)
ఇతర గ్యాలరీలు