Pawan In Vzrm: విజయ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుర్లలో కలుషిత నీటి బాధితులకు పరామర్శ-deputy cm pawan kalyan visited the victims of polluted water in vijaya city ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan In Vzrm: విజయ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుర్లలో కలుషిత నీటి బాధితులకు పరామర్శ

Pawan In Vzrm: విజయ నగరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గుర్లలో కలుషిత నీటి బాధితులకు పరామర్శ

Published Oct 21, 2024 01:12 PM IST Bolleddu Sarath Chandra
Published Oct 21, 2024 01:12 PM IST

  • Pawan In Vzrm: విజయనగరం జిల్లా గుర్ల మండలం, గుర్ల గ్రామంలో కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి మృతి చెందినవారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పరామర్శించారు.  అంతకు ముందు గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. 

విజయనగరం జిల్లాలో కలుషిత నీటి బాధితుల్ని పరామర‌్శిస్తున్న పవన్ కళ్యాణ్‌

(1 / 7)

జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌ నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

(2 / 7)

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఆర్ఎస్ రైల్వే స్టేషన్ సమీపంలో చంపావతి నదిపై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. 

(3 / 7)

విజయనగరం జిల్లా గుర్లలో ప్రబలిన అతిసార బాధితులను పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించేందుకు  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో పర్యటించారు.  విమానాశ్రయం నుంచి గుర్ల గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకొని బాధితులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితిని  పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అంతకు ముందు వాటర్ సోర్స్ పాయింట్స్ పరిశీలిస్తారు.  అనంతరం అతిసారం కట్టడికి చేపట్టిన నివారణ చర్యల మీద, ప్రస్తుత పరిస్థితి మీద, నీటి కాలుష్యం తగ్గించేందుకు భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలు మీద  పవన్ కళ్యాణ్  విజయనగరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్షించారు. 

(4 / 7)

నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును అధికారులు  పవన్ కళ్యాణ్‌కు అధికారులు  వివరించారు. నీటి కాలుష్యం ఎక్కడ జరుగుతుందనే దానిపై పవన్ కళ్యాణ్  ఆరా తీశారు. నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు జల వనరుల శాఖ అధికారులకు  పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

(5 / 7)

తాగునీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని అధికారులకు పవన్ స్పష్టం చేశారు. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకుని గ్రామీణలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

(6 / 7)

పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాటికి అవసరమైన మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని పవన్ ఆదేశించారు. నీటి కాలుష్యాన్ని గల కారణాలు తెలుసుకోవాలని, దాని నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చెప్పారు. తాగునీటి కాలుష్యానికి గల కారణాలను నివేదిక రూపంలో తెలియజేయాలని ఆదేశించారు.

(7 / 7)

ఇతర గ్యాలరీలు