Healthy Habits: మీ అలవాట్లు ఇలా మార్చుకుంటే.. మీకు ఏ రోగాలు రావు!-daily habits that helps boost your health and improves overall well being ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Habits: మీ అలవాట్లు ఇలా మార్చుకుంటే.. మీకు ఏ రోగాలు రావు!

Healthy Habits: మీ అలవాట్లు ఇలా మార్చుకుంటే.. మీకు ఏ రోగాలు రావు!

Aug 16, 2023, 05:00 AM IST HT Telugu Desk
Aug 16, 2023, 05:00 AM , IST

  • Healthy Habits: మనం అనుసరించే అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కొన్ని అలవాట్లను మార్చుకుంటే దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజూ వ్యాయామం చేయండి. కనీసం గంటన్నర పాటు వ్యాయామం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. ఎముకల బలం పెరుగుతుంది. కుదరకపోతే రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి. 

(1 / 5)

రోజూ వ్యాయామం చేయండి. కనీసం గంటన్నర పాటు వ్యాయామం చేయడం శరీరానికి మేలు చేస్తుంది. ఎముకల బలం పెరుగుతుంది. కుదరకపోతే రోజుకు అరగంటైనా వ్యాయామం చేయాలి. (Pixabay)

మీ ఇష్టానుసారం తినడం కంటే సమతుల్యమైన ఆహారం తినండి. ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా తగ్గించాలి. మీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలను పెంచాలి. 

(2 / 5)

మీ ఇష్టానుసారం తినడం కంటే సమతుల్యమైన ఆహారం తినండి. ఫాస్ట్ ఫుడ్ తినడం చాలా తగ్గించాలి. మీ ఆహారంలో పండ్లు, ఆకుకూరలను పెంచాలి. (Pixabay)

ప్రతీ మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. కానీ చాలా మందికి నిద్ర సరిగా పట్టదు. దీంతో వారు అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటి అలవాట్లను అలవర్చుకోవాలి. 

(3 / 5)

ప్రతీ మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. కానీ చాలా మందికి నిద్ర సరిగా పట్టదు. దీంతో వారు అనేక మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా వంటి అలవాట్లను అలవర్చుకోవాలి. 

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగా గుర్తించడం,  నివారించడం మంచిది. అందుకే హెల్త్ చెకప్‌ను జీవితంలో భాగం చేసుకోవాలి. 

(4 / 5)

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగా గుర్తించడం,  నివారించడం మంచిది. అందుకే హెల్త్ చెకప్‌ను జీవితంలో భాగం చేసుకోవాలి. (Pixabay)

ఆల్కహాల్ చాలా తగ్గించాలి, మానేస్తే మరీ మంచిది.  సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగంకు పూర్తిగా దూరంగా ఉండాలి.

(5 / 5)

ఆల్కహాల్ చాలా తగ్గించాలి, మానేస్తే మరీ మంచిది.  సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల వినియోగంకు పూర్తిగా దూరంగా ఉండాలి.

WhatsApp channel

ఇతర గ్యాలరీలు