(1 / 7)
వృద్ధాప్యం దరి చేరేకొద్ది జుట్టు నెరిసిపోవడం సహజం. అయితే తెల్ల వెంట్రుకలు రావటానికి ఇతర కారణాలు ఉన్నాయి. హెయిర్ రూట్‌లో మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు జుట్టు నెరిసిపోతుంది. తినే ఆహారం, జన్యులోపాలు కారణం కావచ్చు. పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ జుట్టు నెరిసిపోవటానికి 5 కారణాలు పేర్కొన్నారు.
(Unsplash)(2 / 7)
Genes: కొన్నిసార్లు జుట్టు త్వరగా నెరవడం అనేది మన తల్లిదండ్రులు లేదా పూర్వీకుల నుండి సంక్రమిస్తుంది.
(Unsplash)(3 / 7)
Protein: జుట్టుకు చాలా పోషణ అవసరం, ఇది ప్రోటీన్ నుండి వస్తుంది. ఒకవేళ మనం తక్కువ ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకుంటే, అది జుట్టు త్వరగా నెరిసిపోయేలా చేస్తుంది.
(Unsplash)(4 / 7)
Stress: నిరంతరం ఒత్తిడి, విచారం, ఆందోళనలు ఉంటే కూడా జుట్టు త్వరగా నెరిసిపోయే అవకాశం ఉంటుంది.
(Unsplash)(5 / 7)
Excessive Refined Flour, sugar, alcohol: ఎక్కువగా టీ, కాఫీలు తీసుకోవడం, అధిక మోతాదులో ఆల్కహాల్, ఎక్కువగా మైదాపిండితో చేసే పదార్థాలు తినడం, ఎక్కువ చక్కెర, ఎర్ర మాంసం, వేయించిన మసాలా ఆహారాలు అధికంగా తీసుకోవడం జుట్టు ఆరోగ్యానికి హానికరం. దీంతో జట్టుకు అవసరమయ్యే పోషణ తగ్గి, నెరిసిపోతుంది.
(Unsplash)(6 / 7)
Minerals: రాగి, సెలీనియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్, బి12 , ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు లోపం వల్ల కూడా జుట్టు త్వరగా నెరిసిపోతుంది.
(Unsplash)సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు