తెలుగు న్యూస్ / ఫోటో /
YS Jagan in Kadapa : చంద్రబాబు గెలుపు కోసమే కాంగ్రెస్ రంగ ప్రవేశం - కడపలో జగన్ కీలక వ్యాఖ్యలు
- Andhrapradesh Elections 2024 Updates: సొంత జిల్లాలో కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు.
- Andhrapradesh Elections 2024 Updates: సొంత జిల్లాలో కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని ఆరోపించారు.
(1 / 6)
కడప ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన…. వైసీపీ ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని ఆరోపించారు. (Photo Source YSRCP FB Page)
(2 / 6)
చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని జగన్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీయేను గెలిపించడం కాదా..? అని ప్రశ్నించారు. (Photo Source YSRCP FB Page)
(3 / 6)
చంద్రబాబు పగలు బీజేపీతో రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. రాజకీయాలు ఎంతగానో దిగజారిపోయాయన్న ఆయన…. అవినాశ్ జీవితాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు.(Photo Source YSRCP FB Page)
(4 / 6)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. చంద్రబాబు మనిషి అని అన్నారు జగన్. చంద్రబాబును గెలిపించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మన ఓట్లను చీల్చి కూటమిని గెలిపించే కుట్ర చేశారని అన్నారు. వైఎస్సార్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని మండిపడ్డారు.(Photo Source YSRCP FB Page)
(5 / 6)
“YSR మరణం తర్వాత నన్ను, నా కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది. నన్ను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. ఇప్పుడు ఆయన సమాధి వద్దకు వెళతారంట! ఆయన చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారట”అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. (Photo Source YSRCP FB Page)
(6 / 6)
వైఎస్సార్ వారసులంటూ వస్తున్న వారి కుట్రలను గమనిస్తున్నామని జగన్ అన్నారు. వైఎస్సార్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ పేరు చార్జిషీట్ లో పెట్టింది ఎవరు? పైగా ఆయన పేరును మేమే చార్జిషీట్ లో పెట్టించామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన మీరా ఆయన వారసులు? అంటూ పరోక్షంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు.(Photo Source YSRCP FB Page)
ఇతర గ్యాలరీలు