Chennai Super Kings: ఇన్‍స్టాగ్రామ్‍లోనూ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్.. ఆ మార్క్ దాటిన తొలి ఐపీఎల్ టీమ్‍గా..-chennai super kings csk becomes first ipl team to reach 15 million followers on instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Chennai Super Kings Csk Becomes First Ipl Team To Reach 15 Million Followers On Instagram

Chennai Super Kings: ఇన్‍స్టాగ్రామ్‍లోనూ చెన్నై సూపర్ కింగ్స్ రికార్డ్.. ఆ మార్క్ దాటిన తొలి ఐపీఎల్ టీమ్‍గా..

Mar 31, 2024, 05:14 PM IST Chatakonda Krishna Prakash
Mar 31, 2024, 05:14 PM , IST

  • Chennai Super Kings: ఇప్పటి వరకు ఐదు టైటిళ్లతో ఐపీఎల్‍లో అత్యంత సక్సెస్‍ఫుల్ టీమ్‍గా ఉంది చెన్నై సూపర్ కింగ్స్ (CSK). మరోవైపు, ఇప్పుడు ఇన్‍స్టాగ్రామ్‍లోనూ ఈ జట్టు ఓ రికార్డు సృష్టించింది.

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్‌కు సమానంగా ప్రస్తుతం ఐపీఎల్‍లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. అయితే, ఐపీఎల్ 2024 కోసం కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. సీఎస్‍కేకు యంగ్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. 

(1 / 5)

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ దక్కించుకుంది. ముంబై ఇండియన్స్‌కు సమానంగా ప్రస్తుతం ఐపీఎల్‍లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. అయితే, ఐపీఎల్ 2024 కోసం కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. సీఎస్‍కేకు యంగ్ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. (CSK Twitter)

ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్న తరుణంలో ఇన్‍స్టాగ్రామ్‍లో చెన్నై జట్టు ఓ రికార్డు సృష్టించింది. ఇన్‍స్టాగ్రామ్‍లో 15 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి ఐపీఎల్ టీమ్‍గా చెన్నై సూపర్ కింగ్స్ ఘనత దక్కించుకుంది. 

(2 / 5)

ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్న తరుణంలో ఇన్‍స్టాగ్రామ్‍లో చెన్నై జట్టు ఓ రికార్డు సృష్టించింది. ఇన్‍స్టాగ్రామ్‍లో 15 మిలియన్ ఫాలోవర్లను సంపాదించిన తొలి ఐపీఎల్ టీమ్‍గా చెన్నై సూపర్ కింగ్స్ ఘనత దక్కించుకుంది. (PTI)

చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాకు (@chennaiipl) ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు 15 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ దాటింది. దీంతో ఇన్‍స్టాలో ఈ మార్క్ సాధించిన ఫస్ట్ ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది.

(3 / 5)

చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాకు (@chennaiipl) ఇన్‍స్టాగ్రామ్‍లో నేడు 15 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ దాటింది. దీంతో ఇన్‍స్టాలో ఈ మార్క్ సాధించిన ఫస్ట్ ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది.(CSK-X)

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. బెంగళూరు, గుజరాత్‍పై గెలిచింది. 

(4 / 5)

ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‍ల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. బెంగళూరు, గుజరాత్‍పై గెలిచింది. (ANI)

ఐపీఎల్ 2024లో తన తదుపరి మ్యాచ్‍లో ఆదివారం (మార్చి 31) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చెన్నై తలపడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 

(5 / 5)

ఐపీఎల్ 2024లో తన తదుపరి మ్యాచ్‍లో ఆదివారం (మార్చి 31) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చెన్నై తలపడనుంది. విశాఖపట్నం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. (ANI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు