తెలుగు న్యూస్ / ఫోటో /
Spiritual Retreats | భారతదేశం ఓ ధ్యాన మందిరం.. ఈ ప్రదేశాలు ప్రశాంతతకు కేంద్రాలు!
- భారతదేశం గొప్ప సంస్కృతి, విభిన్న సాంప్రదాయాలకు, వారసత్వ సంపదలకు కేంద్రం మాత్రమే కాకుండా యోగా, ధ్యానం వంటి దివ్యమైన సాధనలకు నిలయం. అందుకే ప్రపంచానికి మన భారతదేశం ఒక ఆదర్శం.
- భారతదేశం గొప్ప సంస్కృతి, విభిన్న సాంప్రదాయాలకు, వారసత్వ సంపదలకు కేంద్రం మాత్రమే కాకుండా యోగా, ధ్యానం వంటి దివ్యమైన సాధనలకు నిలయం. అందుకే ప్రపంచానికి మన భారతదేశం ఒక ఆదర్శం.
(1 / 6)
మనం జీవిస్తున్న ప్రపంచంలో ప్రతి మనిషికి ఒత్తిడి, ఆందోళన ఇతర ఎన్నో సమస్యలు వారి రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారాయి. డబ్బు సంపాదించడం, పేరు, ప్రతిష్ఠలు, బలం, బలగం ఎంత ఉన్నా ఎక్కడో ఒకచోట లోపం ఉంటుంది. వారిలో పూర్తి సంతోషం ఉండదు. మీ అంతరంగంతో కనెక్ట్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి భారతదేశం ఉన్న పలు ఆధ్యాత్మిక, ధ్యాన కేంద్రాల గురించి తెలుసుకోండి.(Usnplash)
(2 / 6)
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలిలో చక్ర యాక్టివేషన్, బ్యాలెన్సింగ్ రిట్రీట్ అనే కేంద్రం ఉంది. ఈ ధ్యాన మందిరం శరీరంలోని శక్తి కేంద్రాల గురించి అవగాహన కల్పిస్తుంది, ఈ చోటు అంతటా సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి విడుదల అవుతుంది. సమతుల్య జీవితాన్ని ఎలా గడపాలో ఇది బోధిస్తుంది.(Unsplash)
(3 / 6)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే సాత్విక్ సదన్ అనే మరో కేంద్రం ఉంది. కుమావోన్ ప్రాంతానికి సమీపంలోని భీమ్‌తాల్‌లో ఉన్న యోగా రిట్రీట్ ఇది. రోజువారీ జీవితంలో ఆయుర్వేదాల ఉపయోగం, జీవనశైలి నిర్వహణపై ఈ కేంద్రం కౌన్సెలింగ్ ఇస్తుంది.(Unsplash)
(4 / 6)
ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ ఒక ప్రసిద్ధ హాలిడే గమ్యస్థానం. ఇక్కడ యోగా ఆశ్రమం ఉంది. ఇది మీ మనస్సు, ఆత్మను పునరుజ్జీవింపజేయడానికి విస్తృత శ్రేణి వెల్‌నెస్ ప్యాకేజీలను అందిస్తుంది.(Unsplash)
(5 / 6)
అష్టాంగ విన్యాస యోగ కేంద్రం.. కర్ణాటకలోని మైసూర్, కేరళలోని వర్కాలలో ఉన్న ఈ కేంద్రం ఆధ్యాత్మిక వికాసం పెంపొందించే లక్ష్యంగా వివిధ ఆధ్యాత్మిక, ధ్యాన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు