cancer: ఏంజెలీనా జోలీ నుంచి సంజయ్ దత్ వరకు..క్యాన్సర్ తో పోరాడి గెలిచిన సెలబ్రెటీలు వీరే
క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడి, నమ్మశక్యం కాని శక్తిని ప్రదర్శిస్తూ, తమ ఆత్మ విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో ఇతరులకు స్ఫూర్తినిచ్చిన ప్రముఖ సెలబ్రిటీలు వీరు. చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలకే కకావికలం అయ్యే వారికి స్ఫూర్తిదాయకం వీరి పోరాటం.
(1 / 10)
చాలా మంది సెలబ్రిటీలు కేన్సర్ అనే భయంకరమైన మహమ్మారి బారిన పడ్డారు. కానీ, వారు కేన్సర్ పై పోరాటంలో నమ్మశక్యం కాని ధైర్యాన్ని ప్రదర్శించారు. ఏంజెలినా జోలీ, సోనాలి బింద్రే మొదలుకొని యువరాజ్ సింగ్ వరకు క్యాన్సర్ తో ధైర్యంగా పోరాడిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు.
(2 / 10)
కేన్సర్ బారిన పడిన వారిలో హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలీ కూడా ఉన్నారు. కేన్సర్ చికిత్స కోసం ఆమె మాస్టెక్టమీ చేయించుకున్నారు, అందుకు సంబంధించిన మచ్చ ఆమె రొమ్ముపై కనిపిస్తుంది. ఆ ప్రభావం తన కెరీర్ పై పడకుండా ఇతరులకు స్ఫూర్తినిచ్చేందుకు, కేన్సర్ పై అవగాహన పెంచేందుకు తన అనుభవం గురించి రాయాలని ఏంజెలినా జోలీ నిర్ణయించుకున్నారు.(Photo by Joel C Ryan/Invision/AP, File)
(3 / 10)
కేన్సర్ పై పోరాడి గెలిచిన వారిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే ఒకరు. ఆమె జూలై 2018 లో, కేన్సర్ బారిన పడ్డారు. తనకు 30% మాత్రమే సర్వైవల్ చాన్సెస్ ఉన్నప్పటికీ.. ఆమె అపారమైన శక్తితో, సానుకూల దృక్పథంతో కేన్సర్ పై విజయం సాధించింది.(Instagram)
(4 / 10)
క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్, మీడియాస్టినల్ సెమినోమా బారిన పడ్డారు. అమెరికాలో చికిత్స తీసుకున్న ఆయన పలు కీమోథెరపీ సెషన్ల అనంతరం స్వాంత్వన పొందారు. (Getty Images)
(5 / 10)
2020లో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడ్డారు. అనంతరం, ఆయన ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందారు. మరుసటి సంవత్సరం, కేన్సర్ పై పోరాటంలో విజయం సాధించానని ప్రకటించాడు.(HT photo)
(6 / 10)
2018 లో, రొమ్ము కేన్సర్ బారిన పడినట్లు తాహిరా కశ్యప్ గుర్తించారు. చికిత్సలో భాగంగా మాస్టెక్టమీ చేయించుకున్నారు. కేన్సర్ పై పోరాటంలో తన అనుభవాన్ని ఆమె ధైర్యంగా ప్రజలతో పంచుకున్నారు, రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలు చేపట్టారు.(HT photo)
(7 / 10)
సీనియర్ నటి కిరణ్ ఖేర్ 2019 లో మల్టిపుల్ మైలోమా, రొమ్ము క్యాన్సర్తో బాధపడ్డారు. మాస్టెక్టమీ చేయించుకున్న తరువాత, ఆమె ఈ ఆరోగ్య సవాళ్లను విజయవంతంగా అధిగమించి, ఇప్పుడు కేన్సర్ రహితంగా ఉన్నారు.(HT photo)
(8 / 10)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా అండాశయ క్యాన్సర్తో విజయవంతంగా పోరాడి విజయం సాధించారు.(HT photo)
(9 / 10)
2009 లో స్టార్ హీరోయిన్ లిసా రే మల్టిపుల్ మైలోమాతో బాధపడ్డారు, ఇది ప్లాస్మా కణాలను ప్రభావితం చేసే రక్త క్యాన్సర్. కేన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె తన పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించారు.(HT photo)
ఇతర గ్యాలరీలు