Celebrities weight Loss Tips: సెలబ్రెటీలు వేగంగా బరువు ఎలా తగ్గుతారు? అసలు వారు ఏం తాగుతారు?-celebrities weight loss tips tamannaah to malaika arora ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Celebrities Weight Loss Tips: సెలబ్రెటీలు వేగంగా బరువు ఎలా తగ్గుతారు? అసలు వారు ఏం తాగుతారు?

Celebrities weight Loss Tips: సెలబ్రెటీలు వేగంగా బరువు ఎలా తగ్గుతారు? అసలు వారు ఏం తాగుతారు?

Jan 05, 2023, 05:06 PM IST Maragani Govardhan
Jan 05, 2023, 05:06 PM , IST

  • సినీ ప్రముఖులు ఓ సినిమాలో కనిపించినట్లు మారోదాంట్లో ఉండరు. ఓ చిత్రంలో పాత్రలకు తగినట్లుగా తమ రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఒకసారి బరువు పెరిగితే.. మరోసారి భారీగా తగ్గుతారు. ఇది వారికి ఎలా సాధ్యమవుతుంది? అని మనలో చాలా మంది అనుకుంటారు. మరి వారి సీక్రెట్ ఎంటో ఇప్పుడు చూద్దాం.

ఫ్యాషన్ నుంచి డైట్ వరకు బాలీవుడ్ సెలబ్రెటీలు ప్రత పనిలోనూ ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఫిట్నెస్, మెరిసే చర్మం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటారు. శరీర బరువును స్థిరంగా మెయింటేన్ చేయడానికి రోజువారీ ఆహారంలో డిటాక్స్ డ్రింక్స్‌ను చేర్చుకుంటారు. ఇది జీర్ణక్రియను, బరువును నిర్వహిస్తుంది. 

(1 / 7)

బాలీవుడ్ నటి నీతూ కపూర్ 64 ఏళ్ల వయస్సులోనూ ఇంకా యాక్టివ్‌గా ఉండటమే కాకుండా ఫిట్‌గా తన శరీరాన్ని మెయింటేయిన్ చేస్తున్నారు. ఇందుకోసం తన డైట్‌లో డిటాక్స్ డ్రింక్స్‌ను తప్పకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోయా, చిక్కుడు గింజలు, బే ఆకులతో పానీయాన్ని తయారు చేసుకుని తాగుతారు. ఇందుకోసం వీటిని రాత్రంతా నానబెట్టి ఆ తర్వాత ఉదయం పూట ఉడకబెట్టి తీసుకుంటారు. ఈ డ్రింక్ జీర్ణక్రియకు ఎంతో మేలును చేకూరుస్తుంది.

(2 / 7)

మిల్కీ బ్యూటీ తమన్నా ఫిట్నెస్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ రోజూ నీరు, నిమ్మకాయ, దాల్చిన చెక్క కలిపిన పానియాన్ని తీసుకుంటుంది. ఈ డ్రింక్ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా పేగుల ఆరోగ్యాన్ని కూడా మంచి చేకూరుస్తుంది. బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. 

(3 / 7)

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ రెగ్యూలర్‌గా తన డైట్‌లో డిటాక్స్ డ్రింక్స్ ఉండేలా చూసుకుంటుంది. నిమ్మకాయ, బ్లాక్ సాల్ట్, కుంకుమ పువ్వును నీటిలో కలిపి అనంతరం మరిగించిన ఆ ద్రవాన్ని తాగుతుంది. ఈ పానీయ వల్ల చర్మ ఎల్లప్పుడు మెరవడమే కాకుండా బరువును కూడా స్థిరంగా ఉంచుతుంది. ఇది కాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

(4 / 7)

ఐదు పదుల వయస్సకు చేరువైనా ఇంకా అత్యంత అందంగా కనిపిస్తూ కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది మలైకా ఆరోరా. తన ఆహారంలో మెంతి గింజలు, జీలకర్ర గింజలతో చేసిన లిక్విడ్‌ను తీసుకుంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రెండు గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఉడకబెట్టడం వల్ల పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

(5 / 7)

సారా అలీ ఖాన్ తెల్లవారుజామున పసుపు, పాలకూర, గోరువెచ్చని నీళ్ల మిశ్రమంతో తయారు చేసిన పానియాన్ని తాగుతుంది. దీని కోసం పాలకూర ఆకులను నీళ్లల్లో మరిగించి వడగట్టి పసుపు పొడిని కలిపి తాగాలి. ఈ పానియం రోగనిరోధక శక్తిని అందించడమే కాకుండా శరీరానికి తగిన మినరల్స్‌ను అందిస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

(6 / 7)

సెలబ్రెటీలు వేగంగా బరువు ఎలా తగ్గుతారు?

(7 / 7)

సెలబ్రెటీలు వేగంగా బరువు ఎలా తగ్గుతారు?

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు