Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా-asia cup 2023 super 4 points table india on top after defeating pakistan cricket news in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా

Sep 12, 2023, 07:20 AM IST Hari Prasad S
Sep 12, 2023, 07:20 AM , IST

  • Asia Cup Super 4 Points Table: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి టాప్‌లోకి దూసుకెళ్లింది టీమిండియా. తాజాగా ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లో ఇండియా మెరుగైన నెట్ రన్‌రేట్ తో టాప్ లో ఉండగా.. పాకిస్థాన్ మూడోస్థానానికి పడిపోయింది.

Asia Cup Super 4 Points Table: వన్డేలలో పాకిస్థాన్ పై అత్యుత్తమ విజయం సాధించిన భారత్.. ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లోనూ టాప్ లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో రెండు పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా చాలా బాగుంది.

(1 / 6)

Asia Cup Super 4 Points Table: ఇండియా చేతుల్లో ఊహించని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది పాకిస్థాన్. ఏకంగా 228 పరుగుల తేడాతో చిత్తవడంతో పాక్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా పడిపోయింది. సూపర్ 4 తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించిన పాక్.. 2 పాయింట్లతో మూడోస్థానానికి పడిపోయింది.

(2 / 6)

Asia Cup Super 4 Points Table: ఆసియా కప్ సూపర్ 4 పాయింట్ల టేబుల్లో శ్రీలంక రెండోస్థానంలో ఉంది. ఆ టీమ్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. 2 పాయింట్లు, 0.420 నెట్ రన్‌రేట్ తో ఇండియా తర్వాత శ్రీలంక నిలిచింది.

(3 / 6)

Asia Cup Super 4 Points Table: సూపర్ 4 పాయింట్ల టేబుల్లో ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్ ఖాతాలో రెండేసి పాయింట్లే ఉన్నా.. ఇండియా నెట్ రన్‌రేట్ చాలా మెరుగ్గా ఉంది. ఏకంగా 228 పరుగుల విజయంతో ఇండియా నెట్ రన్‌రేట్ 4.560గా ఉండగా.. పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ -1.892కి పడిపోయింది.

(4 / 6)

Asia Cup Super 4 Points Table: మంగళవారం (సెప్టెంబర్ 12) శ్రీలంక టీమ్ ఇండియాతో సూపర్ 4 మ్యాచ్ లో తలపడబోతోంది. ఇందులో ఇండియా గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. అయితే పాకిస్థాన్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న శ్రీలంకకు కూడా ఫైనల్ చేరే అవకాశాలు మెరుగ్గానే ఉంటాయి.

(5 / 6)

Asia Cup Super 4 Points Table: ఇక సూపర్ 4లో ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిన బంగ్లాదేశ్ పాయింట్ల టేబుల్లో అట్టడుగున ఉంది. ఆ టీమ్ ఇండియాతో ఈ నెల 15న చివరి సూపర్ 4 మ్యాచ్ ఆడనుంది. బంగ్లాదేశ్ ఫైనల్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు