తెలుగు న్యూస్ / ఫోటో /
AP Free Sand Portal: అందుబాటులోకి ఏపీ ఫ్రీ శాండ్ పోర్టల్.. నేటి నుంచి ఆన్‌లైన్ బుకింగ్..
Free Sand Portal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఉచిత ఇసుక పథకం అమలులో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలకు కావాల్సిన సదుపాయాలపై హిందుస్తాన్ టైమ్స్ సూచనల్ని పరిగణలోకి తీసుకుని శాండ్ పోర్టల్ సిద్ధం చేశారు.
(1 / 8)
ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసేందుకు శాండ్ పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రజలు ఇకపై ఆన్‌లైన్‌లో ఇసుకను నేరుగా బుక్ చేసుకోవచ్చు.
(2 / 8)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పాలసీని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇసుక రవాణాపై నిఘా ఉంచుతూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. టోల్ ఫ్రీ ద్వారా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4599
(3 / 8)
ఉచిత ఇసుక రవాణాలో రాష్ట్ర వ్యాప్తంగా లారీలకు నిర్దిష్ట ఛార్జీలను నిర్ణయించారు. వాటిని మాత్రమే రవాణాకు అమలు చేయాలి. అధికంగా వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తారు. ప్రతి లారీకి జీపీఎస్ అనుసంధానం చేస్తారు.
(5 / 8)
వాగులు, వంకలు, గ్రామీణ ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక తరలింపుపై ఎలాంటి ఆంక్షలు లేకుండా తీసుకువెళ్లొచ్చు
(6 / 8)
ఉచిత ఇసుక విధానంలో తలెత్తే సమస్య ల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 4599కు ఫిర్యాదు చేయొచ్చు
ఇతర గ్యాలరీలు