తెలుగు న్యూస్ / ఫోటో /
CM Jagan at Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
- AP CM Y S Jagan prays at Indrakeeladri: దసరా శరన్నవరాత్రుల్లో విశేష పుణ్యదినమైన మూలా నక్షత్రం రోజైన శుక్రవారం సీఎం జగన్… కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
- AP CM Y S Jagan prays at Indrakeeladri: దసరా శరన్నవరాత్రుల్లో విశేష పుణ్యదినమైన మూలా నక్షత్రం రోజైన శుక్రవారం సీఎం జగన్… కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.
(1 / 4)
ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుండి మధ్యాహ్నం 3.40 గంటలకి ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చిన రాజగోపురం వద్ద స్థానాచార్యులు విష్ణు బట్ల శివప్రసాద్ శర్మ పరివేష్ఠం చేశారు.
(2 / 4)
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంప్రదాయ వస్త్రధారణతో పట్టు వస్త్రాలను, పసుపు కుంకుమలను తలపై పెట్టుకుని అంతరాలయానికి చేరుకొని అమ్మవారికి సమర్పించారు.
(3 / 4)
ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు.
(4 / 4)
అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే ఈ శుభ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు