(1 / 6)
రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడింది.
(image source from @APSDMA Twitter)(2 / 6)
హైదరాబాద్ లో కురిసిన వర్షం దాడికి దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
(image source from @APSDMA Twitter)(3 / 6)
తెలంగాణలో మరో నాలుగైదు రోజులు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరమ కేంద్రం తెలిపింది. జులై 7వ తేదీ వరకు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(image source from @APSDMA Twitter)(4 / 6)
జులై 8, 9, 10 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, వికరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
(5 / 6)
ఇవాళ (శనివారం) ఏపీలోని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
(image source from @APSDMA Twitter)(6 / 6)
శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, శ్రీ సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
(image source from @APSDMA Twitter)ఇతర గ్యాలరీలు