తెలుగు న్యూస్ / ఫోటో /
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ ప్రెగ్నెంట్.. వైరల్‌గా మారిన ఫోటోలు
- తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
- తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
(1 / 6)
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో పలు విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సాధించుకుంది. తాజాగా ‘రౌడీబాయ్స్’ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుపమ పరమేశ్వరన్.
(2 / 6)
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెరకెక్కిన ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి బోల్డ్ పాత్రలు చేయడానికి తాను సిద్ధమంటూ చెప్పకనే చెప్పింది. సోమవారం తన తండ్రితో కలిసి దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఆమె గర్భవతిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.
(3 / 6)
ఇందులో తాలిబొట్టు, నుదిటిన తిలకం ధరించి అనుపమ కనిపిస్తుండటంతో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ రియల్ ది కాదు. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ’మణియరాయిలే అశోకన్‘ సినిమా షూటింగ్ లో సరదాగా తీసుకొన్న ఫొటో ఇదని అనుపమ పరమేశ్వరన్ పేర్కొన్నది.
(4 / 6)
హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తూనే సహాయ దర్శకురాలిగా పనిచేసింది. సినిమా షూటింగ్ లో గర్భవతిగా నటిస్తున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో దిగిన ఫొటోను సోమవారం అనుపమ పరమేశ్వరన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది.
(5 / 6)
ఈ ఫొటోను ఉద్దేశిస్తూ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం ఇదెప్పుడు జరిగిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తెలుగులో నిఖిల్ హీరోగా నటిస్తున్న ’కార్తికేయ 2‘, ’18 పేజీస్‘ సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నది.
ఇతర గ్యాలరీలు