తెలుగు న్యూస్ / ఫోటో /
ఉసిరి నుంచి ఈ రహస్య ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
- Amla Health Benefits: ఉసిరిలోని ఔషధ గుణాలు చర్మం, జుట్టు సంరక్షణకే కాక జీర్ణ వ్యవస్థను కూడా కాపాడుతాయి.
- Amla Health Benefits: ఉసిరిలోని ఔషధ గుణాలు చర్మం, జుట్టు సంరక్షణకే కాక జీర్ణ వ్యవస్థను కూడా కాపాడుతాయి.
(1 / 6)
ఉసిరికాయ దాని అద్భుతమైన గుణాల కారణంగా ఔషధంగా పిలుస్తారు. దీనిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మందికి తెలియదు. కేవలం కార్తీక పౌర్ణమి రోజు తల స్నానానికి మాత్రమే పనికొస్తుందని భావిస్తారు.(Freepik)
(2 / 6)
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందడంలో దీనికేదీ సాటిరాదు. ఉసిరికాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.(Freepik)
(3 / 6)
జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉసిరి చాలా సహాయపడుతుంది. శరీరంలో ఉన్న మలినాలను తరిమికొట్టి జీర్ణాశయ వ్యవస్థ చక్కగా పనిచేసేలా తోడ్పడుతుంది. రోజూ పరిగడుపను ఉసిరి రసం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను పూర్తిగా దూరం చేసుకోవచ్చు. మలబద్దకం సమస్యే ఉండదు.(Freepik)
(4 / 6)
ఆమ్లా చర్మ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది, వాతావరణం వల్ల కలిగే చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో ఇది చాలా సహాయపడుతుంది.(Freepik)
(5 / 6)
ఉసిరి బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజును నియంత్రణలో పెడుతుంది. అంటే ఇది మధుమేహులకు చక్కటి నేస్తం.(Freepik)
ఇతర గ్యాలరీలు