తెలుగు న్యూస్ / ఫోటో /
Anti Oxidant Amla: ప్రకృతిలో అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉసిరితో ప్రయోజనాలు ఎన్నో…
- Anti Oxidant Amla:ఉసిరికాయ మనకు లభించే ఆహారపదార్ధాలన్నింటిలో అత్యద్భుతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్న పదార్ధం.శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతో పాటు కాలుష్యం వల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో ఉసిరి చక్కటి పాత్ర పోషిస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే కణవిభజనను ఉసిరి నివారిస్తుంది.
- Anti Oxidant Amla:ఉసిరికాయ మనకు లభించే ఆహారపదార్ధాలన్నింటిలో అత్యద్భుతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్న పదార్ధం.శరీరంలో నిరంతరం జరిగే జీవ ప్రక్రియతో పాటు కాలుష్యం వల్ల శరీరంలో కణాల మధ్య జరిగే నష్టాన్ని నివారించడంలో ఉసిరి చక్కటి పాత్ర పోషిస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే కణవిభజనను ఉసిరి నివారిస్తుంది.
(1 / 10)
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముసలితనాన్ని నిరోధించి నిత్య యవ్వనంతో శక్తివంతులుగా చేయడంలో ఉసిరి దివ్యఔషధంగా పనిచేస్తుంది.
(3 / 10)
ఉసిరికాయ సంతానలేమికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు వీర్య కణాలను వృద్ధి చేయడంలో ఉపయోగపడేది. ఉసిరిని తీసుకోవడం ద్వారా వీర్యకణాల వృద్ధికి ఉపయోగపడేది.
(4 / 10)
ప్రతి ఒక్కరు ఏదో రకమైన ఎలర్జీలతో సతమతం అవుతుంటారు. కాలుష్య ప్రభావంతో 30శాతం ఏదో రకమైన ఎలర్జీతో బాధపడుతుంటారు. ఈ ఎలర్జీ ఆస్మా రూపంలో, ఎగ్జిమా రూపంలో ఉంటుంది. ఎలర్జీ నుంచి రక్షణ కల్పించడంలో ఉసిరికాయ ఉపయోగపడుతుంది.
(5 / 10)
ఉసిరి ఫంగస్ నిరోధకంగా, రక్త నాళాల్లో కలిగే ప్లేక్ నిరోధకంగా, క్యాన్సర్ నిరోధకంగా, జీవకణాల్లో డిఎన్ఏ కు రక్షణ కల్పించడం ద్వారా రోగనిరోధకంగా పనిచేస్తుంది.
(6 / 10)
ఉసిరిలో శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ సి 1800మిల్లీ గ్రాములు, కాల్షియమ్ 17మిల్లీ గ్రాములు, ఫాస్పరస్ 26మిల్లీ గ్రాములు, ట్రోఫ్టోఫాన్ 3మిల్లీగ్రాములు, మెథియోనైన్ 2మిల్లీగ్రాములు ఉంటాయి. శరీరంలో కణజాలాన్ని కలిపి ఉంచే పునరుత్పత్తి చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.
(7 / 10)
ఉసిరిలో దానిమ్మకాయ కంటే 60రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అసాయ్ కంటే రెండు రెట్లు అధికంగా ఉంటాయి. గూజ్ బెర్రీస్‌తో పోలిస్తే 75రెట్లు అధికంగా ఉండటం వల్ల ఉసిరిని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు.
(8 / 10)
ఉసిరికాయ నిజానికి అద్భుతమైన ఫలంగానే భావించాలి. సూపర్‌ఫుడ్‌గా పరిగణించే పసుపు కంటే ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ రెంటు రెట్లు అధికంగా ఉంటాయి.
(9 / 10)
శరీరంలో అనారోగ్యాన్ని కలిగించే ఫ్రీరాడికల్స్‌ను అనే కణాలను నిర్వీర్యం చేసి ఆరోగ్య రక్షణకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్‌ను శరీరరమే ఉత్పత్తి చేస్తుంది. మరికొన్ని ఆహారంతో, మూలికల ద్వారా లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే వాటిలో ఉసిరికాయ ప్రధానమైనది.
ఇతర గ్యాలరీలు