Onam Significance : సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమే ఈ ఓనం.. ఎందుకంటే..-all you need to know about the 6 events that take place during onam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Onam Significance : సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమే ఈ ఓనం.. ఎందుకంటే..

Onam Significance : సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమే ఈ ఓనం.. ఎందుకంటే..

Aug 26, 2022, 02:03 PM IST Geddam Vijaya Madhuri
Aug 26, 2022, 02:03 PM , IST

  • ఓనం. కేరళ ప్రజలు 10 రోజుల పాటు ఆనందంతో చేసుకునే ఓ అద్భుతమైన పండుగ ఇది. అయితే ఈ సందర్భంగా మలయాళీలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, కవాతులు నిర్వహిస్తారు. మరి వాటి ప్రాముఖ్యతలు కూడా అంతే ఇంట్రెస్టింగ్​గా ఉంటాయి. మీరు కూడా వాటి గురించి తెలుసుకోండి.

Onam : మలయాళీలు వార్షికంగా చేసుకునే పంట పండుగనే ఓనమ్ అంటారు. దీనిని ఆగస్టు - సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఇది రాజు మహాబలి విజయంతో స్వదేశానికి రావడాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు దీనిని నిర్వహించుకోనున్నారు. అయితే పండుగ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. 

(1 / 7)

Onam : మలయాళీలు వార్షికంగా చేసుకునే పంట పండుగనే ఓనమ్ అంటారు. దీనిని ఆగస్టు - సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఇది రాజు మహాబలి విజయంతో స్వదేశానికి రావడాన్ని సూచిస్తుంది. ఈ సంవత్సరం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8 వరకు దీనిని నిర్వహించుకోనున్నారు. అయితే పండుగ గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. (HT Photo/Vivek Nair)

Pulikali (Tiger dance): ఈ జానపద నృత్య రూపాన్ని ఓనం పండుగ నాలుగో రోజున ప్రదర్శిస్తారు. ఈ రోజున భక్తులు తమ ముఖాలకు, శరీరాలకు పసుపు, ఎరుపు, నలుపు చారలతో పులుల వంటి రంగులు వేసుకుని.. తకిల్, ఉడుక్కు, చెండ వంటి సాంప్రదాయ తాళ వాయిద్యాల లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు.

(2 / 7)

Pulikali (Tiger dance): ఈ జానపద నృత్య రూపాన్ని ఓనం పండుగ నాలుగో రోజున ప్రదర్శిస్తారు. ఈ రోజున భక్తులు తమ ముఖాలకు, శరీరాలకు పసుపు, ఎరుపు, నలుపు చారలతో పులుల వంటి రంగులు వేసుకుని.. తకిల్, ఉడుక్కు, చెండ వంటి సాంప్రదాయ తాళ వాయిద్యాల లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు.(AFP)

Onam Sadhya (Grand meal): ఈ ప్రత్యేకమైన సాంప్రదాయ భోజనం ఓనం రోజున తయారు చేస్తారు. దీనిని అరటి ఆకుపై వడ్డించుకుని తింటారు. ఇది 24 కంటే ఎక్కువ నుంచి కొన్నిసార్లు 64 వంటలతో నిండి ఉంటుంది.

(3 / 7)

Onam Sadhya (Grand meal): ఈ ప్రత్యేకమైన సాంప్రదాయ భోజనం ఓనం రోజున తయారు చేస్తారు. దీనిని అరటి ఆకుపై వడ్డించుకుని తింటారు. ఇది 24 కంటే ఎక్కువ నుంచి కొన్నిసార్లు 64 వంటలతో నిండి ఉంటుంది.(Instagram/@alreefpanasiabh)

Folk Dances : సాంప్రదాయ జానపద సంగీతం, నృత్యం లేకుండా ఏ పండుగ పూర్తి కాదు. కైకొట్టికలి అనేది కేరళలో మలయాళ పండుగ ఓనం సందర్భంగా ఎక్కువగా మహిళలు చేసే ఆలయ నృత్యం.

(4 / 7)

Folk Dances : సాంప్రదాయ జానపద సంగీతం, నృత్యం లేకుండా ఏ పండుగ పూర్తి కాదు. కైకొట్టికలి అనేది కేరళలో మలయాళ పండుగ ఓనం సందర్భంగా ఎక్కువగా మహిళలు చేసే ఆలయ నృత్యం.(Instagram/@nrityanjali_mumbai)

Pookalam (Floral rangoli) : ఇది తాజా పువ్వులను ఉపయోగించి తయారు ముగ్గు. మలయాళంలో ‘పూ’ అంటే పువ్వు, ‘కోలం’ అంటే డిజైన్. ఈ కార్యక్రమం ఐక్యతను స్ఫూర్తిని సూచిస్తుంది.

(5 / 7)

Pookalam (Floral rangoli) : ఇది తాజా పువ్వులను ఉపయోగించి తయారు ముగ్గు. మలయాళంలో ‘పూ’ అంటే పువ్వు, ‘కోలం’ అంటే డిజైన్. ఈ కార్యక్రమం ఐక్యతను స్ఫూర్తిని సూచిస్తుంది.(Unsplash)

Tripunithura Athachamayam : ఇది త్రిపుణితుర పట్టణంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది త్రిపుణితుర నుంచి త్రిక్కకరలోని వామన దేవాలయానికొస్తే మహారాజు విజయవంతమైన కవాతును సూచిస్తుంది.

(6 / 7)

Tripunithura Athachamayam : ఇది త్రిపుణితుర పట్టణంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది త్రిపుణితుర నుంచి త్రిక్కకరలోని వామన దేవాలయానికొస్తే మహారాజు విజయవంతమైన కవాతును సూచిస్తుంది.(Pexels)

Vallamkali (Boat race): అరన్ముల బోట్ రేస్ లేదా అరన్ముల ఉత్రిట్టతి వల్లంకలి అనేది ఒక గొప్ప కార్యక్రమం. దీనిని ఉత్రిత్తతి నక్షత్రం రోజున నిర్వహిస్తారు. కేరళలోని అత్యంత పురాతనమైన, గౌరవనీయమైన పడవ పోటీలలో ఒకటి.

(7 / 7)

Vallamkali (Boat race): అరన్ముల బోట్ రేస్ లేదా అరన్ముల ఉత్రిట్టతి వల్లంకలి అనేది ఒక గొప్ప కార్యక్రమం. దీనిని ఉత్రిత్తతి నక్షత్రం రోజున నిర్వహిస్తారు. కేరళలోని అత్యంత పురాతనమైన, గౌరవనీయమైన పడవ పోటీలలో ఒకటి.(Instagram/@b_anandu_nair)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు