తెలుగు న్యూస్ / ఫోటో /
CBN In Delhi Pics: ఢిల్లీలో చంద్రబాబు , మంత్రులతో వరుస భేటీలు…ఏపీకి సాయం చేయాలని వినతులు
- CBN In Delhi Pics: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఢిల్లీలో బాబు వరుస భేటీలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై తక్షణం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- CBN In Delhi Pics: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఢిల్లీలో బాబు వరుస భేటీలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై తక్షణం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
(1 / 10)
సిఎం హోదాలో తొలి సారి ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది,. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల కోసం తొలి పర్యటనలోనే చంద్రబాబు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీతో సహా తొలిరోజు 7గురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సిఎం భేటీ అయ్యారు. శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.
(2 / 10)
ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలను చంద్రబాబు నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వీలైనంతగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
(3 / 10)
గురువారం కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్ లతో బాబు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం నీతిఆయోగ్ ఛైర్మన్,సీఈవోలతో భేటీ అయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు.
(4 / 10)
చంద్రబాబు పర్యటనలో రాజ్ నాధ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతీ ఆయోగ్ సీఈవోలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల్లో వ్యత్యాసంపై హస్తినలో సైతం విస్తృత చర్చ జరుగుతోంది.
(5 / 10)
రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా ఏపి సిఎంకు ఢిల్లీలో ప్రాధాన్యం లభిస్తోంది. చంద్రబాబుకు కేంద్ర మంత్రులు తగిన గౌరవం ఇస్తున్నారు. లోక్ సభలో టీడీపీకి పెరిగిన బలం నేపథ్యంలో చంద్రబాబుకు డిల్లీలో అందుకు తగ్గట్టుగా గౌరవం లభిస్తోంది. కేంద్ర పెద్దల స్పందన వేగంగా, సానుకూలంగా ఉందంటున్న ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
(6 / 10)
ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో పాటు.... వివిధ శాఖల్లో ఉన్న 60 మంది ఐఎఎస్ అధికారులకు ఏపీ సిఎం చంద్రబాబు విందు ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదలకు సహకరించాలని కోరారు. ప్రాజెక్టుల మంజూరుతో పాటు శాఖా పరమైన సహాయంలో చొరవ చూపాలని ఐఎఎస్ లను చంద్రబాబు కోరారు.
(7 / 10)
ఢిల్లీ ప్రర్యటనలో ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నడ్డాతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు.
(8 / 10)
వైద్య రంగానికి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతులను వేగంగా మంజూరు చేయాని నడ్డాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇతర గ్యాలరీలు