9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్-911 attacks 23rd anniversary brings biden harris trump together to ground zero in photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  9/11 Attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

9/11 attacks: ఒకే వేదిక వద్దకు బైడెన్, హారిస్, ట్రంప్ ను తీసుకువచ్చిన బాధాకర ఈవెంట్

Sep 12, 2024, 08:41 PM IST Sudarshan V
Sep 12, 2024, 08:41 PM , IST

అమెరికా సహా ప్రపంచాన్న దిగ్బ్రాంతపర్చిన 9/11 ఉగ్రవాద దాడులకు 23 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఆ ఉగ్రవాద దాడిలో న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలి 2,996 మంది మృతి చెందారు.

9/11 దాడులకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాషింగ్టన్లోని పెంటగాన్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పాల్గొన్నారు.

(1 / 8)

9/11 దాడులకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాషింగ్టన్లోని పెంటగాన్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పాల్గొన్నారు.(AP/PTI)

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఈ స్మారక కార్యక్రమానికి హాజరయ్యారు,

(2 / 8)

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఈ స్మారక కార్యక్రమానికి హాజరయ్యారు,(AP)

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.

(3 / 8)

రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు అధ్యక్ష డిబేట్లో పాల్గొన్న 12 గంటల తర్వాత డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో ఈ కార్యక్రమం సందర్భంగా కరచాలనం చేశారు.(. REUTERS/Mike Segar )

బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, దాడుల్లో మరణించిన వారితో పాటు ప్రాణాలతో బయటపడిన వారు, వారి కుటుంబ సభ్యులు 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించి శోకసంద్రంలో మునిగిపోయారు. 9/11 స్మారకం వద్ద ఉదయం 8 గంటలకు నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

(4 / 8)

బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు, దాడుల్లో మరణించిన వారితో పాటు ప్రాణాలతో బయటపడిన వారు, వారి కుటుంబ సభ్యులు 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించి శోకసంద్రంలో మునిగిపోయారు. 9/11 స్మారకం వద్ద ఉదయం 8 గంటలకు నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.( REUTERS/Kent J.Edwards)

తమకు న్యాయం కావాలని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 'మీలో ఎవరికి మా హీరో అయ్యే ధైర్యం ఉంది? మేము మరింత మెరుగ్గా ఉండటానికి మీరేం చేయగలరు?’’ అని 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బార్బరా పి వాల్ష్ కుమార్తె వాల్ష్-డిమార్జియో అన్నారు.

(5 / 8)

తమకు న్యాయం కావాలని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 'మీలో ఎవరికి మా హీరో అయ్యే ధైర్యం ఉంది? మేము మరింత మెరుగ్గా ఉండటానికి మీరేం చేయగలరు?’’ అని 9/11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బార్బరా పి వాల్ష్ కుమార్తె వాల్ష్-డిమార్జియో అన్నారు.( Spencer Platt/Getty Images/AFP)

అనేక మంది బాధిత కుటుంబాలు స్మారక చిహ్నం వద్ద సంతాప సందేశాలు ఇవ్వగా, మరికొందరు ఇప్పటి వరకు దోషులను శిక్షించలేకపోవడాన్ని ప్రశ్నించారు.

(6 / 8)

అనేక మంది బాధిత కుటుంబాలు స్మారక చిహ్నం వద్ద సంతాప సందేశాలు ఇవ్వగా, మరికొందరు ఇప్పటి వరకు దోషులను శిక్షించలేకపోవడాన్ని ప్రశ్నించారు.(REUTERS/Kent J.Edwards)

న్యూయార్క్ లో ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న ప్రదేశంలో నేషనల్ సెప్టెంబర్ 11 మెమోరియల్ & మ్యూజియం ను ఏర్పాటు చేశారు. 

(7 / 8)

న్యూయార్క్ లో ఒకప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న ప్రదేశంలో నేషనల్ సెప్టెంబర్ 11 మెమోరియల్ & మ్యూజియం ను ఏర్పాటు చేశారు. (REUTERS/Kent J.Edwards)

2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడుల్లో అమరవీరుల పేర్ల పక్కన జెండాలు, పూలతో నివాళులర్పించారు. మెమొరియల్ పూల్ లోని 152 కాంస్య పారా పెట్ లపై బాధితుల పేర్లను చెక్కారు. 

(8 / 8)

2001 సెప్టెంబర్ 11న జరిగిన దాడుల్లో అమరవీరుల పేర్ల పక్కన జెండాలు, పూలతో నివాళులర్పించారు. మెమొరియల్ పూల్ లోని 152 కాంస్య పారా పెట్ లపై బాధితుల పేర్లను చెక్కారు. (AP Photo/Yuki Iwamura)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు