Relationships । ఏ జంట అయినా విడిపోవడానికి దారితీసే 5 ముఖ్య కారణాలు ఇవే!-5 reasons your relationships do not last read in telugu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Reasons Your Relationships Do Not Last, Read In Telugu

Relationships । ఏ జంట అయినా విడిపోవడానికి దారితీసే 5 ముఖ్య కారణాలు ఇవే!

Feb 27, 2023, 07:30 PM IST HT Lifestyle Desk
Feb 27, 2023, 07:30 PM , IST

  • Relationships: బంధాలు- బంధుత్వాలు అనేవి ప్రతీ ఒక్కరి జీవితంలోని ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, కొన్నిసార్లు బంధాలను కలిగి ఉండటం సవాలుగా ఉంటుంది. విడిపోవడానికి దారితీసే ముఖ్యమైన కారణాలు చూడండి.

 కలిసి జీవించటానికి ఉన్న బంధాలు, కొన్నిసార్లు విడిపోవటానికి దారితీస్తాయి. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యమైన 5 కారణాలు ఇప్పుడు చూద్దాం.

(1 / 6)

 కలిసి జీవించటానికి ఉన్న బంధాలు, కొన్నిసార్లు విడిపోవటానికి దారితీస్తాయి. అందుకు చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యమైన 5 కారణాలు ఇప్పుడు చూద్దాం.(pixabay)

అపార్థాలు- మాట పట్టింపులు: సరిగ్గా కమ్యూనికేట్ చేయనప్పుడు అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరి మధ్య మాట-మాట పెరిగి చివరికి, సంబంధం ముగింపుకు దారితీస్తుంది. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండటం, మీ భావాలను సరిగ్గా వ్యక్తీకరించడం చాలా అవసరం.

(2 / 6)

అపార్థాలు- మాట పట్టింపులు: సరిగ్గా కమ్యూనికేట్ చేయనప్పుడు అపార్థాలు, విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరి మధ్య మాట-మాట పెరిగి చివరికి, సంబంధం ముగింపుకు దారితీస్తుంది. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండటం, మీ భావాలను సరిగ్గా వ్యక్తీకరించడం చాలా అవసరం.(Pexels)

విలువలు- లక్ష్యాలు: సంబంధంలో ఇద్దరి మధ్య కొన్ని లక్ష్యాలు, విలువలు ఒకేలా ఉండాలి. ఒకరు జీవితంలో స్థిరపడాలని, పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటే, మరొకరు ప్రపంచాన్ని పర్యటించి, సంతానం లేకుండా ఉండాలని కోరుకుంటే, ఈ విబేధాలు విడిపోవడానికి దారితీస్తాయి.

(3 / 6)

విలువలు- లక్ష్యాలు: సంబంధంలో ఇద్దరి మధ్య కొన్ని లక్ష్యాలు, విలువలు ఒకేలా ఉండాలి. ఒకరు జీవితంలో స్థిరపడాలని, పిల్లలను కలిగి ఉండాలని కోరుకుంటే, మరొకరు ప్రపంచాన్ని పర్యటించి, సంతానం లేకుండా ఉండాలని కోరుకుంటే, ఈ విబేధాలు విడిపోవడానికి దారితీస్తాయి.(Unsplash)

నమ్మకం లేకపోవడం: నమ్మకం ఏదైనా సంబంధానికి పునాది. నమ్మకం లేకుండా, బంధంలో శాశ్వతకాలం కొనసాగటం కష్టమే.   భాగస్వామి ఎల్లప్పుడూ అనుమానాలు, అసూయలు కలిగి ఉంటే ముగింపు దగ్గర్లోనే ఉన్నట్లు.

(4 / 6)

నమ్మకం లేకపోవడం: నమ్మకం ఏదైనా సంబంధానికి పునాది. నమ్మకం లేకుండా, బంధంలో శాశ్వతకాలం కొనసాగటం కష్టమే.   భాగస్వామి ఎల్లప్పుడూ అనుమానాలు, అసూయలు కలిగి ఉంటే ముగింపు దగ్గర్లోనే ఉన్నట్లు.(Pexels )

జీవనశైలి:  ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు వారి వ్యక్తిత్వం, జీవనశైలి లేదా ఆసక్తులలో కొన్నింటిలో పాలుపంచుకోవాలి. ప్రతీ విషయంలో ఒకరు మాత్రమే రాజీ పడాల్సి వస్తే, వారు కలిసి ఉండలేరు. 

(5 / 6)

జీవనశైలి:  ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు వారి వ్యక్తిత్వం, జీవనశైలి లేదా ఆసక్తులలో కొన్నింటిలో పాలుపంచుకోవాలి. ప్రతీ విషయంలో ఒకరు మాత్రమే రాజీ పడాల్సి వస్తే, వారు కలిసి ఉండలేరు. (Representational image)

 ప్రయత్నం లేకపోవడం:  చిరకాలం కలిసి ఉండాలంటే అందుకు ఇద్దరి నుండి ప్రయత్నం, నిబద్ధత అవసరం. ఒకరు మాత్రమే శ్రద్ధ చూపడం, మరొకరు నిర్లక్ష్యంగా ఉండటం వలన బంధం కొనసాగదు. 

(6 / 6)

 ప్రయత్నం లేకపోవడం:  చిరకాలం కలిసి ఉండాలంటే అందుకు ఇద్దరి నుండి ప్రయత్నం, నిబద్ధత అవసరం. ఒకరు మాత్రమే శ్రద్ధ చూపడం, మరొకరు నిర్లక్ష్యంగా ఉండటం వలన బంధం కొనసాగదు. (Pexels)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు