తెలుగు న్యూస్ / ఫోటో /
Places To Visit in March । మార్చిలో విహారయాత్రకు బడ్జెట్ అనుకూల ప్రదేశాలు ఇవే!
- Places To Visit in March: మార్చిలో విహారయాత్ర చేయాలనుకుంటే భారతదేశంలో బడ్జెట్ ధరలలోనే సందర్శించడానికి కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఏమిటో ఇక్కడ చూడండి.
- Places To Visit in March: మార్చిలో విహారయాత్ర చేయాలనుకుంటే భారతదేశంలో బడ్జెట్ ధరలలోనే సందర్శించడానికి కొన్ని ఉత్తమ ప్రదేశాలు ఏమిటో ఇక్కడ చూడండి.
(1 / 6)
భారతదేశంలో మార్చి నెలలో వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. ఎక్కువ ఎండ ఉండదు, ఎక్కువ చలి ఉండదు. ఇలాంటి వెచ్చని సమయంలో భారతదేశంలో సందర్శించడానికి కొన్ని బడ్జెట్ అనుకూలమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి..(Unsplash)
(2 / 6)
గోవా: గోవా ఒక ప్రసిద్ధ బీచ్ గమ్యస్థానం, ఇక్కడ మార్చిలో వాతావరణం మామూలుగా ఉంటుంది, రద్దీ తక్కువగా ఉంటుంది. గోవా సందర్శించడానికి ఇది మంచి సమయం. మీరు గోవాలోని అందమైన బీచ్‌లు, వాటర్ స్పోర్ట్స్, నైట్ లైఫ్‌ని ఆస్వాదించవచ్చు. (Unsplash)
(3 / 6)
రిషికేశ్, ఉత్తరాఖండ్: రిషికేశ్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం. యోగా, ధ్యానానికి ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది గంగా నది ఒడ్డున ఉంది. దాని చుట్టూ అందమైన కొండలు, అడవులు ఉన్నాయి.(Unsplash)
(4 / 6)
హంపి, కర్ణాటక: హంపి యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. పురాతన శిధిలాలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది, ఇది ఒకనాటి భారతదేశం గొప్ప చరిత్ర, సంస్కృతిని కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది. (Unsplash)
(5 / 6)
జైపూర్, రాజస్థాన్: "పింక్ సిటీ"గా ప్రసిద్ధి చెందిన జైపూర్ అనేక చారిత్రక కోటలు, రాజభవనాలతో కూడిన ఒక రంగుల నగరం. మార్చిలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, ఇది సందర్శనకు సరైన సమయం. (Unsplash)
(6 / 6)
వారణాసి, ఉత్తరప్రదేశ్: వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటి. భారతదేశ ఆధ్యాత్మిక రాజధానిగా పరిగణిస్తారు. శివాలయం, పురాతన దేవాలయాలు, ఘాట్‌లు, పవిత్ర గంగానదికి ప్రసిద్ధి చెందింది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక పండుగలు జరుగుతాయి కాబట్టి వారణాసిని సందర్శించడానికి మార్చి మంచి సమయం.(Unsplash)
ఇతర గ్యాలరీలు