తెలుగు న్యూస్ / ఫోటో /
2024 KTM 990 Duke: 947 సీసీ ఇంజిన్ తో, బీస్ట్ లుక్ తో ఆల్ న్యూ 2024 కేటీఎం 990 డ్యూక్
- 2024 KTM 990 Duke: KTM 990 డ్యూక్ కొత్త 947 cc, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 121 bhp పవర్ ను, 103 Nm పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
- 2024 KTM 990 Duke: KTM 990 డ్యూక్ కొత్త 947 cc, లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 121 bhp పవర్ ను, 103 Nm పీక్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.
(1 / 10)
EICMA 2023లో 2024 990 డ్యూక్‌ను KTM ఆవిష్కరించింది. రాబోయే నెలల్లో ఈ మోటార్‌సైకిల్ గ్లోబల్ మార్కెట్‌లోకి రానుంది. ఈ బైక్ ను ఆస్ట్రియాలోని మట్టిగోఫెన్‌లోని KTM మెయిన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.
(2 / 10)
KTM 990 డ్యూక్ ఇతర సేమ్ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లతో పోటీపడనుంది. ప్రస్తుతానికి, KTM 990 డ్యూక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే ఆలోచన కేటీఎంకు ప్రస్తుతానికి లేదు.
(3 / 10)
990 డ్యూక్ కు అమర్చిన ఇంజన్ ను యూరో 5+ నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఇది లిక్విడ్-కూల్డ్, 947 సిసి, పారెలల్-ట్విన్ ఇంజన్. ఇది 9,500 rpm వద్ద 121 bhp గరిష్ట శక్తిని, 6,750 rpm వద్ద 103 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ఉంటుంది. అలాగే, రైడర్ క్విక్ షిఫ్టర్‌ను కూడా ఎంచుకోవచ్చు.
(5 / 10)
అంతేకాకుండా, ఇందులోని స్వింగ్ ఆర్మ్ కూడా కొత్తది. ట్రిపుల్ క్లాంప్ ను ఫోర్జ్డ్ అల్యూమినియంతో తయారు చేశారు. 990 డ్యూక్ లో 17 ఇంచ్ వీల్స్ ఉంటాయి. వీటిని 1290 సూపర్ డ్యూక్ R నుంచి తీసుకున్నారు, ఈ బైక్ లో స్టాండర్డ్‌గా బ్రిడ్జ్‌స్టోన్ S22 టైర్‌లను అమర్చారు.
(6 / 10)
ఈ బైక్ కు 43 mm WP అపెక్స్ ఓపెన్ కాట్రిడ్జ్ 140 mm ఫోర్క్స్ సస్పెన్షన్స్ ను అమర్చారు. వెనుక భాగంలో WP అపెక్స్ మోనోషాక్ ఉంది.
(7 / 10)
ఈ బైక్ కు 300 మిమీ డిస్క్ బ్రేక్స్ ను ముందువైపు, సింగిల్-పిస్టన్ కాలిపర్ సింగిల్ 240 మిమీ డిస్క్ వెనుక వైపు అమర్చారు.
(8 / 10)
ఈ బైక్ లో ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, ల్యాప్ టైమర్, స్విచ్ చేయగల ABS, లీన్ యాంగిల్ డేటా.. తదితర ఫీచర్్ ఉన్నాయి.
(9 / 10)
అదనంగా, 990 డ్యూక్‌లో LED లైటింగ్, USB టైప్ C ఛార్జర్, 5-అంగుళాల TFT స్క్రీన్ ఉన్నాయి. రెయిన్, స్ట్రీట్, స్పోర్ట్, ట్రాక్, పర్ఫార్మెన్స్ అనే ఐదు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు