UP Police : ‘భార్యను దోమలు కుడుతున్నాయి’- భర్త ట్వీట్.. సాయం చేసిన పోలీసులు!
UP Police viral news : భార్యను దోమలు కుడుతున్నాయంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. మస్కిటో కాయిల్స్ తీసుకెళ్లి ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.
UP Police viral news : 'నా భార్యను దొమలు కుడుతున్నాయి. సహాయం చేయండి,' అంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన పోలీసులు.. మస్కిటో కాయిల్స్‌ని తీసుకెళ్లి ఇచ్చారు. పోలీసులు.. ఇలా మస్కిటో కాయిల్స్‌ని కూడా అందించే కార్యక్రమం చేపట్టారా? అన్న అనుమానం మీకు రావొచ్చు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన వేరు! అసలు కథ ఏంటంటే..
ఆసుపత్రిలో దోమలు..
ఉత్తర్ ప్రదేశ్‌లోని చాందౌసిలో నివాసముంటున్న అసద్ ఖాన్ అనే వ్యక్తి.. పురుటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను హరి ప్రకాశ్ నర్సింగ్ హోంకు తీసుకెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున.. అక్కడ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ ఆసుపత్రిలో దోమలు విపరీతంగా ఉన్నాయి. ప్రసవ వేదనతో పాటు దొమలు కుడుతుండటంతో ఆ మహిళ చాలా బాధపడింది. తన భార్య బాధను చూసిన ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. సాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అర్ధరాత్రి- తెల్లవారుజామున కావడంతో అతనికి దోమల మందు, మస్కిటో కాయిల్స్ దొరకలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు.
UP Police latest news : "అందమైన ఆడబిడ్డకు నా భార్య జన్మనిచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉన్నప్పటికీ.. ప్రసవంతో నా భార్య పడుతున్న బాధ చూడలేకపోయాను. అదే సమయంలో దోమలు కూడా ఆమెను విపరీతంగా కుట్టాయి. నొప్పి ఇంకా పెరిగింది. వెంటనే ఓ ఆలోచన వచ్చింది. సాయం చేయాలని యూపీ పోలీసులకు ట్వీట్ చేశాను," అని అసద్ ఖాన్ పేర్కొన్నాడు.
UP Police help citizens : అసద్ ఖాన్ ట్వీట్‌ను సంభాల్ పోలీసులు కొద్దిసేపటికే చూశారు. 'ఇలాంటివి కూడా పోలీసులకు చెబుతారా?' అని వారు ఆలోచించలేదు. వెంటనే స్పందించి.. 10-15 నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకున్నారు. మస్కిటో కాయిల్స్‌ని అసద్ ఖాన్‌కి ఇచ్చారు. అది చూసి అసద్ ఖాన్ చాలా సంతోషించాడు.
UP Police news : యూపీ పోలీసులు చేసిన సాయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలిసిన వారందరు పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సంబంధిత కథనం