AirIndia passenger who urinated on woman:ఆ ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ ఎవరో తెలుసా?
Air India passenger who urinated on woman: సహ ప్రయాణీకురాలిపై మూత్రం పోసిన ఆ ఎయిర్ ఇండియా ప్యాసెంజర్ ఎవరో తెలిసింది. ఆయనను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
AirIndia passenger who urinated on woman: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తన సహ ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసిన ప్యాసెంజర్ ఎవరో తెలిసింది. అతడు ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలో ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగి కావడం విశేషం.
Air India passenger who urinated on woman: అతడి పేరు శంకర్ మిశ్రా..
నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్రం పోసిన వ్యక్తిని శంకర్ మిశ్రాగా గుర్తించారు. ఆయన ముంబై వాస్త్యవ్యుడని, మల్టీ నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ‘వెల్స్ ఫార్గొ (Wells Fargo)’లో వైస్ ప్రెసిడెంట్ హోదాలో పని చేస్తున్నారు. ఆ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. అయితే, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఎయిర్ ఇండియా (Air India) పై పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. దాంతో, ఎయిర్ ఇండియా డిసెంబర్ 28న ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Air India passenger who urinated on woman: ఎందుకంత లేట్?
విమానంలో సహ ప్రయాణికురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన నవంబర్ 26 న జరిగితే, ఆ విషయంపై డిసెంబర్ 28 వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఎయిర్ ఇండియాపై డీజీసీఏ(DGCA) మండిపడింది. దాంతో, అందుకు కారణాలను వివరిస్తూ, ఎయిర్ ఇండియా(Air India) డీజీసీఏ కు ఒక నివేదిక అందించింది. మరోవైపు, ఇంత దారుణానికి పాల్పడిన శంకర్ మిశ్రాపై కేవలం ఒక నెల రోజుల పాటే విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించడాన్ని కూడా పలువురు తప్పుబట్టారు.
Air India passenger who urinated on woman: పోలీసు కేసు
ఎయిర్ ఇండియా (Air India) ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శంకర్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఆయనపై లైంగిక వేధింపులు, పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్, అసభ్య ప్రవర్తన తదితర నేరారోపణలపై కేసు పెట్టారు. అరెస్ట్ భయంతో శంకర్ మిశ్రా పరారయ్యాడని, అతడిని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.