Garlic made of cement : సిమెంట్​తో వెల్లుల్లి తయారీ- వైరల్​ వీడియో చూస్తే షాక్​ అవుతారు!-viral video shoes fake garlic made of cement sold in maharashtra ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Garlic Made Of Cement : సిమెంట్​తో వెల్లుల్లి తయారీ- వైరల్​ వీడియో చూస్తే షాక్​ అవుతారు!

Garlic made of cement : సిమెంట్​తో వెల్లుల్లి తయారీ- వైరల్​ వీడియో చూస్తే షాక్​ అవుతారు!

Sharath Chitturi HT Telugu
Aug 19, 2024 07:15 AM IST

Garlic made of cement : సిమెంట్​తో తయారు చేసిన వెల్లుల్లి వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. కొందరు, కస్టమర్లను ఈ విధంగా మోసం చేస్తున్నారు. వీడియో చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు.

సిమెంట్​తో తయారు చేసిన వెల్లుల్లి..
సిమెంట్​తో తయారు చేసిన వెల్లుల్లి..

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో మహారాష్ట్ర అకోలా జిల్లాలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితుల నుంచి లబ్ధిపొందేందుకు కొందరు.. సిమెంట్​తో వెల్లుల్లిని తయారు చేసి విక్రయించడం మొదలుపెట్టారు! ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో మహారాష్ట్ర అకోలా జిల్లాకు చెందినది. కొందరు వెల్లుల్లి విక్రయదారులు కొనుగోలుదారులను ఈ విధంగా మోసం చేస్తున్నారు. అకోలాలోని బజోరియా నగర్​లో నివాసముంటున్న రీటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్​ సుభాష్​ పాటిల్ భార్య​ ఈ స్కామ్​ని బయటపెట్టారు. ఇంటి బయట వెల్లుల్లి కొనగా.. వాటిల్లో చాలా వరకు సిమెంట్​తో తయారు చేసినవే అని తేలింది.

రోడ్డు మీద వెల్లుల్లి అమ్ముకునే వ్యక్తి నుంచి 250 గ్రాములు కొనుగోలు చేశారు పాటిల్​ భార్య. ఇంటికి తిరిగి వచ్చి వెల్లుల్లిని కట్​ చేసేందుకు ప్రయత్నించారు. కానీ అవి విడిపోలేదు! పైగా చాలా బలంగా కనిపించాయి. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అసలు విషయం బయటపడింది. అది సహజమైన వెల్లుల్లి కాదని, సిమెంట్​తో తయారైన వెల్లుల్లి అని స్పష్టమైంది. వాటిపై వైట్​ కోటింగ్​ వేసి, సహజమైన లుక్​ని తీసుకొచ్చి విక్రయించి, కస్టమర్లను మోసం చేస్తున్నారని తేలింది.

ప్రజా ఆరోగ్య భద్రతకు విఘాతం కలిగిస్తూ, కస్టమర్లను మోసం చేస్తూ, సహజమైన వెల్లుల్లి పేరుతో సిమెంట్​తో తయారు చేసిన వెల్లుల్లిని విక్రయిస్తున్నారని సుభాష్​ పాటిల్​ మండిపడ్డారు.

సాధారణంగా ఎవరుపడితే వారికి ఇలా విక్రయించారు! ఎవరైనా కొనుగోలు చేసే సమయంలో అశ్రద్ధగా ఉంటారో, అలాంటి వారి చూపును మళ్లించి, కొన్ని సహజమైన వాటిల్లో ఈ సిమెంట్​తో తయారు చేసిన వెల్లుల్లిని కలిపి విక్రయిస్తారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప, ఏది సహజమైనది, ఏది సిమెంట్​తో తయారు చేసినదో చెప్పడం కష్టం అవుతుంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. నెటిజన్లు వీడియోని చూసి షాక్​ అవుతున్నారు. విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. "ప్రజల ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు," అని ఒకరు అనగా, "ప్రతి విషయంలో నాణ్యత తగ్గిపోతోంది. ఇలా అయితే ఎలా బతకాలి," అని మరొకరు అభిప్రాయపడ్డారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన సిమెంట్​ వెల్లుల్లి దృశ్యాలను ఇక్కడ చూడండి

సంబంధిత కథనం