UPSC recruitment 2023: యూత్ ఆఫీసర్ పోస్ట్ లకు యూపీఎస్సీ నోటిఫికేషన్-upsc recruitment 2023 69 youth officers and other posts notified ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Recruitment 2023: యూత్ ఆఫీసర్ పోస్ట్ లకు యూపీఎస్సీ నోటిఫికేషన్

UPSC recruitment 2023: యూత్ ఆఫీసర్ పోస్ట్ లకు యూపీఎస్సీ నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 07:20 PM IST

యూత్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్ తదితర పోస్ట్ ల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Union Public Service Commission UPSC) యూత్ ఆఫీసర్, అసిస్టెంట్ మైనింగ్ ఆఫీసర్ తదితర పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని కోరింది.

Apply online: ఆన్ లైన్ లోనే అప్లై

ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే అప్లై చేసుకోవాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.upsc.gov.in వెబ్ సైట్ ద్వారా మార్చి 25 నుంచి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 13.

vacancy details: వేకెన్సీ వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 69 పోస్ట్ లను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. వాటిలో

  • రీజనల్ డైరెక్టర్ 1
  • అసిస్టెంట్ కమిషనర్ 1
  • అసిస్టెంట్ ఓర్ డ్రెసింగ్ ఆఫీసర్ 22
  • అసిస్టెంట్ మినరల్ ఎకనమిస్ట్ (ఇంటలిజెన్స్) 4
  • అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్ 34
  • యూత్ ఆఫీసర్ 7.. పోస్ట్ లున్నాయి.

how to apply : దరఖాస్తు చేయడం ఎలా?

  • ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునేవారు ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in లేదా www.upsc.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే “ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS” లింక్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
  • ఫీజును చెల్లించి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్ర పర్చుకోవాలి.

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Whats_app_banner