స్టూడెంట్​తో శృంగారం​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!-uk teacher groomed 15 year old student for sex before becoming pregnant with another schoolboy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  స్టూడెంట్​తో శృంగారం​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

స్టూడెంట్​తో శృంగారం​ చేసిన టీచర్​ అరెస్ట్​.. బెయిల్​పై బయటకు వచ్చి మరో విద్యార్థి వల్ల గర్భం!

Sharath Chitturi HT Telugu
Oct 01, 2024 11:54 AM IST

Teacher student sex : ఓ విద్యార్థితో శృంగారం​ చేసిందన్న ఆరోపణలతో అరెస్ట్​ అయ్యి, బెయిల్​ మీద బయటకు వచ్చిన ఓ టీచర్​.. మరో విద్యార్థి వల్ల గర్భం దాల్చింది! ఈ ఘటన యూకేలో జరిగింది.

యూకేలో షాకింగ్​ ఘటన.. ఇద్దరు విద్యార్థులతో టీచర్​ సెక్స్​!
యూకేలో షాకింగ్​ ఘటన.. ఇద్దరు విద్యార్థులతో టీచర్​ సెక్స్​!

UK teacher sex with student: యూకేలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థితో శృంగారం​ చేస్తోందన్న ఆరోపణలతో అరెస్ట్​ అయిన టీచర్​.. బెయిల్​పై బయటకు వచ్చింది. కొన్ని నెలలకే ఆమె గర్భం దాల్చింది! మరో విద్యార్థితో శృంగారం​ చేయడం ఇందుకు కారణం.

ఇదీ జరిగింది..

బీబీసీ ప్రకారం.. సంబంధిత టీచర్​ పేరు రెబెకా జోన్స్​. ఆమె వయస్సు 30ఏళ్లు. ఓ 15ఏళ్ల విద్యార్థితో ఆమె కొంత కాలం రిలేషన్​ని నడిపింది. అతనికి రూ. 36వేలు పెట్టి గిఫ్ట్​లు కొనిచ్చేది. చివరికి వారిద్దరు ఓ రోజు శృంగారం​ చేశారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు.. ఆ బాలుడు, తన స్నేహితుడితో పంచుకున్నాడు. అలా ఈ విషయం బయటపడింది. పోలీసులు.. రెబెకా జోన్స్​ని అరెస్ట్​ చేశారు.

మరోవైపు.. రెబెకను పాఠశాల సిబ్బంది సస్పెండ్​ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేసింది. ఆ స్కూల్​ పేరు, ఆ బాలుడి పేరు తెలియరాలదు.

ఆ బాలుడును కోర్టు ఎదుట హాజరుపరిచి, ప్రాసిక్యూట్​ చేశారు. ఆ తర్వాత.. ఈ కేసు వాయిదా పడింది. రెబెకా జోన్స్​కి బెయిల్​ కూడా వచ్చింది.

UK teacher becomes pregnant : ఇంతలో.. మరో షాకింగ్​ విషయం అధికారులకు తెలిసింది. ఆమె అప్పటికే మరో విద్యార్థితో చాలా కాలంగా రిలేషన్​లో ఉన్నట్టు తేలింది.

అధికారులు ఆ రెండో అబ్బాయిని కూడా విచారించారు.

"నాకు మిస్​ జోన్స్​ చాలా కాలంగా తెలుసు. ఆమెను స్కూల్​ నుంచి సస్పెండ్​ చేసిన తర్వాత మేమిద్దరు టచ్​లో ఉండటం మొదలుపెట్టాము. 15ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఓసారి ఆమె ఫ్లాట్​కి వెళ్లాను. ముద్దు పెట్టుకున్నాము. నాకు 16ఏళ్లు వచ్చిన తర్వాత.. శృంగారం​ చేశాము," అని ఆ విద్యార్థి చెప్పాడు.

కాగా.. ఆ 16ఏళ్ల బాలుడితో శృంగారం చేయడం​ కారణంగా.. రెబెకా జోన్స్​ గర్భం దాల్చింది.

"విద్యార్థితో శృంగారం​ చేయలేదని ఇక ఆ టీచర్​ చెప్పలేదు. ఎందుకంటే ఆమె కడుపులో ఆ స్టూడెంట్​ బిడ్డ ఉంది," అని అధికారులు వెల్లడించారు.

Teacher sex with student : ఈ పూర్తి వ్యవహారంపై మరో రెండు వారాల్లో విచారణ జరుగుతుందని యూకే మీడియా చెబుతోంది.

రెబెకా మాత్రం.. తన మీద వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. పోలీసులు వేసిన కేసుల్లో నిజం లేదని చెబుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం