'అలా మసాజ్ చేస్తే గిఫ్ట్ ఇస్తా'- మహిళపై ఎలాన్ మస్క్ లైంగిక వేధింపులు!
తనపై ఎలాన్ మస్క్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించగా.. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు స్పేస్ఎక్స్ భారీ మొత్తాన్ని ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తలపై మస్క్, స్పేస్ఎక్స్ స్పందించలేదు.
ఎలాన్ మస్క్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వివాదాన్ని పరిష్కరించేందుకు స్పేస్ఎక్స్ సంస్థ భారీ మొత్తాన్నే ఖర్చుపెట్టింది. ఎలాన్ మస్క్ సీఈఓగా ఉన్న స్పేస్ఎక్స్.. సంబంధిత మహిళకు ఏకంగా 2,50,000 డాలర్లు( సుమారు రూ. 2కోట్లు) చెల్లించినట్టు ఇన్సైడర్ అనే వార్త సంస్థ పేర్కొంది.
2016లో..
సంబంధిత మహిళ 2016లో స్పెస్ ఎక్స్ కార్పొరేట్ విమానంలో కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేసింది. ఆ సమయంలోనే ఓ సందర్భంలో.. విమానంలోని ప్రైవేటు గదికి మస్క్ తనని పిలిచినట్టు, లైంగికంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. 'ఎరాటిక్ మసాజ్ చేస్తే.. గుర్రాన్ని గిఫ్ట్‌గా ఇస్తా,' అని మస్క్ తనతో అన్నట్టు ఆమె పేర్కొంది.
కాగా.. ఈ వివాదాన్ని స్పేస్ఎక్స్ 2018లోనే పరిష్కరించినట్టు ఇన్సైడర్ పేర్కొంది. స్పేస్ఎక్స్.. సంబంధిత మహిళకు 2,50,000డాలర్లు ఇచ్చినట్టు వివరించింది. ఇందుకు సంబంధించిన పత్రాలు, సంబంధిత మహిళ స్నేహితురాలి డిక్లరేషన్ తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది.
'అవన్నీ అబద్ధాలే..'
కాగా ఈ విషయంపై మస్క్ స్పందించారు. స్పేస్ఎక్స్ వ్యవస్థపకుడైన మస్క్.. ఆ వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పారు.
"ఈ వార్త రాసిన వారు అబద్ధం చెబుతున్నారు. నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని అయిన సంపాదించి బయపెట్టాలని నేను కోరుతున్నాను. వారు అలా చేయలేరు. ఎందుకంటే అసలు అది నిజమే కాదు. నాపై జరుగుతున్న దాడులను రాజకీయ కోణంలో చూడాలి. నా మీద ఎన్ని నిందలు మోపినా.. నేను వెనకడుగు వేయను. భావప్రకటనా స్వేచ్ఛ కోసం కృషి చేస్తూనే ఉంటాను," అని స్పష్టం చేశారు మస్క్.
సంబంధిత కథనం