Big jolt to Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ షాక్-setback to uddhav thackeray as 12 state chiefs of shiv sena join shinde camp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Big Jolt To Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ షాక్

Big jolt to Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ షాక్

HT Telugu Desk HT Telugu
Sep 16, 2022 03:56 PM IST

Big jolt to Uddhav Thackeray: సంక్షోభంలో చిక్కుకున్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కు తాజాగా పార్టీ నేతలు మరో షాక్ ఇచ్చారు.

<p>శివసేన రాష్ట్రాల అధ్యక్షులతో షిండే</p>
శివసేన రాష్ట్రాల అధ్యక్షులతో షిండే

Big jolt to Uddhav Thackeray: శివసేన సంక్షోభంలో ఉంది. నిజమైన పార్టీ తనదేనని ఒకవైపు తిరుగుబాటు నేత, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వాదిస్తున్నారు. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులోనూ, ఎన్నికల సంఘం వద్ద ఉన్నది. ఈ నేపథ్యంలో ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

Big jolt to Uddhav Thackeray: 12 మంది చీఫ్ లు షిండే వర్గంలోకి

వివిధ రాష్ట్రాలు, నగరాల్లోని శివసేన అధ్యక్షులు గురువారం షిండే వర్గంలో చేరారు. ముంబైలో జరిగిన ఒక సమావేశం అనంతరం వారు మహారాష్ట్ర సీఎం షిండే సమక్షంలో ఆయన వర్గంలో చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమే తాము షిండే గ్రూప్ లో చేరుతున్నామని, తమదే నిజమైన శివసేన అని వారు స్పష్టం చేశారు. 15 రాష్ట్రాల శివసేన అధ్యక్షుల్లో 12 మంది ప్రస్తుతం షిండే గ్రూప్ లో చేరారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అన్నిరకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా షిండే వారికి హామీ ఇచ్చారు.

Big jolt to Uddhav Thackeray: వీరే ఆ చీఫ్ లు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సమక్షంలో ఆయన గ్రూప్ లో చేరిన రాష్ట్రాల శివసేన అధ్యక్షుల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్, మణిపూర్, చత్తీస్ గఢ్, గుజరాత్, రాజస్తాన్, గోవా, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల చీఫ్స్ ఉన్నారు. హైదరాబాద్ శివసేన అధ్యక్షుడు మరారి కూడా గురువారం షిండే వర్గంలో చేరారు. శివసేన పార్టీ, పార్టీ గుర్తు, జెండా ఎవరికి చెందుతాయన్న విషయంపై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో, షిండే వర్గంలోకి తాజా చేరికలు, నిజమైన సేన తనదేనన్న ఆయన వాదనను మరింత బలోపేతం చేసే అవకాశముంది.

Whats_app_banner