Raut to meet PM, Amit Shah: మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న శివసేన నేత సంజయ్ రౌత్-raut meets pawar hints at calling on pm amit shah ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Raut To Meet Pm, Amit Shah: మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న శివసేన నేత సంజయ్ రౌత్

Raut to meet PM, Amit Shah: మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న శివసేన నేత సంజయ్ రౌత్

HT Telugu Desk HT Telugu
Nov 10, 2022 10:45 PM IST

Sanjay Raut to meet PM, Amit Shah: అవినీతి ఆరోపణలపై జైలుకెళ్లి, బెయిల్ పై బుధవారం విడుదలైన శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ గురువారం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు.

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సంజయ్ రౌత్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సంజయ్ రౌత్ (ANI)

Sanjay Raut to meet PM, Amit Shah: శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే కు సంజయ్ రౌత్ అత్యంత సన్నిహితుడు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ పత్రిక సామ్నాకు ఎడిటర్ కూడా ఆయనే. బీజేపీ పై, ఆ పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. అలాంటి నాయకుడు, త్వరలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కలవబోతున్నానని ప్రకటించడం సంచలనం సృష్టించింది.

Sanjay Raut to meet PM, Amit Shah: ఆగస్ట్ 1న అరెస్ట్

ముంబై శివార్లలోని గోరేగావ్ లో ఉన్న పాత్రా చాల్ రీ డెవలప్ మెంట్ కార్యక్రమంలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలపై enforcement directorate (ED) ఆగస్ట్ 1న సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసింది. దాదాపు 3 నెలలు జైళ్లో గడిపిన అనంతరం, నవంబర్ 9న ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు.

Sanjay Raut to meet PM, Amit Shah: ఫడణవీస్ ను కలుస్తా..

జైలు నుంచి విడుదలైన మర్నాడు, నవంబర్ 10న సంజయ్ రౌత్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో సమావేశమయ్యారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, తాను త్వరలో బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ను కలుస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి సంబంధించిన ప్రాజెక్టులతో చర్చించడం కోసం ఫడణవీస్ తో సమావేశమవుతానని వెల్లడించారు. ‘ఆ తరువాత, ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలతో కూడా భేటీ అవుతాను’ అని సంజయ్ రౌత్ వెల్లడించారు.

Sanjay Raut to meet PM, Amit Shah: సంజయ్ రౌత్ యూ టర్న్

అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తోందని సంజయ్ రౌత్ ప్రశంసించారు. ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి ఫడణవీస్ మంచి నిర్ణయాలు తీసుకున్నారు. నిజానికి ఇక్కడ ప్రభుత్వాన్ని ఫడణవీస్ నడుపుతున్నారు. ఏక్ నాథ్ షిండే కాదు’’ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌత్ తీసుకున్న యూ టర్న్ ఇప్పుడు మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.

Sanjay Raut to meet PM, Amit Shah: భారత్ జోడో యాత్ర..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్రపై రౌత్ ప్రశంసలు గుప్పించారు. భారత్ జోడో ఒక ఉద్యమం. సమాజంలో నెలకొన్న విద్వేషాన్ని అంతం చేసే యాత్ర. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేేసే ఈ యాత్రకు బీజేపీ కూడా మద్దతివ్వాలి’ అని వ్యాఖ్యానించారు. సంజయ్ రౌత్ గురువారం ఉదయం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Whats_app_banner