Rajasthan rape case : బావిలో బాలిక మృతదేహం.. టీచర్​ రేప్​ చేసి చంపేశాడా?-rajasthan news body of 16 year old girl found in well locals allege rape murder by school teacher ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rajasthan Rape Case : బావిలో బాలిక మృతదేహం.. టీచర్​ రేప్​ చేసి చంపేశాడా?

Rajasthan rape case : బావిలో బాలిక మృతదేహం.. టీచర్​ రేప్​ చేసి చంపేశాడా?

Sharath Chitturi HT Telugu
Aug 11, 2023 07:42 AM IST

Rajasthan rape case : రాజస్థాన్​లో ఓ బాలిక మృతదేహం బావిలో కనిపించింది. ఓ టీచర్​, ఆమెను రేప్​ చేసి, చంపేశాడని స్థానికులు ఆందోళన చేపట్టారు.

బావిలో బాలిక మృతదేహం.. టీచర్​ రేప్​ చేసి చంపేశాడా?
బావిలో బాలిక మృతదేహం.. టీచర్​ రేప్​ చేసి చంపేశాడా?

Rajasthan rape case : రాజస్థాన్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 16ఏళ్ల బాలిక మృతదేహాన్ని అధికారులు ఓ బావిలో నుంచి బయటకు తీశారు. బాలిక చదువుకుంటున్న స్కూల్​లోని టీచర్​.. ఆమెను రేప్​ చేసి, చంపేశాడని ఆరోపణలు వస్తున్నాయి.

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ సవాయ్​ మధోపూర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుకుంటోంది. కాగా.. ఆగస్ట్​ 8న ఆమె అదృశ్యమైంది. అదే స్కూల్​లో టీచర్​గా పనిచేస్తున్న రామ్​రతన్​ మీనా.. తన బిడ్డను అపహరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాలిక తండ్రి.

Minor raped by teacher in Rajasthan : బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా గురువారం నాడు ఓ బావిలో ఆమె మృతదేహం కనిపించింది. బాధితురాలి మృతదేహంతో ఆమె కుటుంబసభ్యులు, స్థానికులు నిరసనకు దిగారు. స్కూల్​ ప్లేగ్రౌండ్​లో మృతదేహాన్ని పెట్టి ఆందోళన చేపట్టారు. తమకు పరిహారం కావాలని, స్కూల్​ సిబ్బందిని తొలగించాలని, ఘటనపై సీనియర్​ స్థాయి అధికారులు దర్యాప్తు చేపట్టాలని, నిందితులను వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​ చేశారు.

మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామ్​రతన్​ మీనాను అరెస్ట్​ చేశారు. అతడిని విచారిస్తున్నట్టు వెల్లడించారు. కాగా స్థానికుల నిరసనల కారణంగా బాలిక మృతదేహానికి పోస్టుమార్టం చేయలేకపోతున్నట్టు వివరించారు. కుటుంబసభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే న్యాయం చేయగలమని పేర్కొన్నారు.

మరోవైపు.. తాజా ఘటనతో సంబంధిత ప్రభుత్వ పాఠాశాల వార్తలకెక్కింది. ఈ నేపథ్యంలో అందులోని సిబ్బందిలో పురుషులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాలు వెలువడ్డాయి.

రాజకీయ దుమారం..

Rajasthan crime news : తాజా ఘటనపై రాజస్థాన్​లో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వంపై విపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

"కాంగ్రెస్​ పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. సవాయ్​ మధోపూర్​లో మరో బాలికను చంపి, బావిలో పడేశారు. శాంతిభద్రతలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి," అని బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్​ అన్నారు.

రాజస్థాన్​లో ఈ తరహా ఘటనలు ఈ మధ్య కాలంలో ఆందోళనకరంగా మారాయి. కొన్ని రోజుల క్రితమే.. ఓ 14ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. నిందితులు.. ఆమెను రేప్​ చేసి చంపేశారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

కాగా.. గత నెలలో ఓ యువతి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు పోలీసులు. బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఆమెను చంపేసి, బావిలో పడేశారని ఆరోపణలు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం