Madhya Pradesh rape case : ఇద్దరు బాలికలపై ఏడుగురు సామూహిక అత్యాచారం!
Madhya Pradesh rape case : మధ్యప్రదేశ్‌లో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Madhya Pradesh rape case : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను వీడియో తీసి బాధితులను బెదిరించారు.
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ రేవాలోని హనుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో 25 రోజుల క్రితం ఘటన జరిగింది. గ్యాంగ్ రేప్‌నకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాజాగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వీడియోను పరిశీలించిన పోలీసులు బాధితులను ట్రేస్ చేశారు. ఎందుకు పోలీసులను ఆశ్రయించలేదని అడగ్గా.. బాధితులు తమకు జరిగినది వివరించారు.
"మేము మేకలను తీసుకుని అడవిలోకి వెళ్లాము. కొందరు అక్కడక్కడే తిరుగుతూ కనిపించారు. మాపై వారు దాడి చేశారు. మా ఇద్దరిని రేప్ చేశారు. వీడియోలు తీశారు. ఎవరికైనా చెబితే వాటిని వైరల్ చేస్తామని బెదిరించరు. ఆ భయంతోనే మేము ఎవరికి చెప్పలేదు," అని బాధితుల్లో ఒకరు పోలీసులకు వివరించారు.
Minors gang raped in Madhya Pradesh : బాధితులిద్దరు బంధువులని తెలుస్తోంది. పోలీసులు చెప్పడంతో బాధితులు, వారి కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దాని ఆధారంగా సోమవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వీడియోలో కనిపించిన ఏడుగురిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ ఏడేళ్ల బాలిక రేప్‌నకు గురైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. బల్లియాలోని నర్హి ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బాలిక.. మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లగా.. 19ఏళ్ల సరల్ యాదవ్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం