PM Modi : తల్లి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ.. -prime minister narendra modi met his mother heeraben modi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi : తల్లి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ..

PM Modi : తల్లి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ..

Sharath Chitturi HT Telugu
Jun 18, 2022 07:47 AM IST

గుజరాత్​లోని తన తల్లి హీరాబెన్​ మోదీ నివాసానికి వెళ్లారు ప్రధాని మోదీ. ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా.. హీరాబెన్​ పాదాలు కడిగి, మిఠాయి తినిపించారు.

తల్లి సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
తల్లి సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (ANI)

PM Modi : గుజరాత్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గాంధీనగర్​లోని తన తల్లి హీరాబెన్​ మోదీ నివాసానికి వెళ్లారు. 100వ పుట్టిన రోజును జరుపుకుంటున్న తల్లికి సేవలు చేశారు ప్రధాని.

హీరాబెన్​ పాదాలు కడిగి, ఆమెకు మిఠాయి తినిపించారు ప్రధానమంత్రి. అనంతరం ఆమెతో కొంతసేపు ముచ్చటించారు.

అక్కడే కొద్దిసేపు ఉన్న ప్రధాని.. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు.

PM Modi Gujarat visit : రెండు రోజుల గుజరాత్​ పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్​ విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ. శనివారం పావగఢ్​కు వెళ్లనున్నారు. అక్కడి ఆలయంలో పూజలు చేసిన అనంతరం జెండా ఎగురవేస్తారు.

వడోదరలో రూ. 21వేల కోట్లు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం

టాపిక్