UP Elections | ఉత్తరప్రదేశ్, గోవాల్లో ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రెండో దశతోపాటు గోవాలోనూ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో రాష్ట్ర ఉత్తరాఖండ్‌లో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.
గోవాలో పోలింగ్ స్టేషన్ కు వెళ్తున్న సిబ్బంది (PTI)
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో 55 స్థానాలకుగాను సోమవారం రెండో దశ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో పాటు 40 స్థానాలు ఉన్న గోవాలోనూ పోలింగ్ జరుగుతోంది. యూపీలో పోలింగ్ జరుగుతున్న స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ పట్టున్నవే ఎక్కువగా ఉన్నాయి.
ఇక గోవాలో గవర్నర్ శ్రీధరన్ పిళ్లై, ఆయన భార్య రీటా శ్రీధరన్ ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గవర్నర్ దంపతులు తాలీగావ్ నియోజకవర్గ పరిధిలోని 15వ పోలింగ్ బూత్‌లో ఓట్లు వేశారు.
పెద్ద ఎత్తున తరలివచ్చి ఓట్లు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అభివృద్ధికి, భయ, అల్లర్ల రహిత ఉత్తరప్రదేశ్ కోసం తమకే ఓటు వేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విటర్ ద్వారా సందేశమిచ్చారు.