PM Modi: పీఎం మాతృమూర్తి మృతిపై చిన్నారి రాసిన సంతాప లేఖ; ప్రధాని స్పందన వైరల్
PM Modi's ‘heartwarming’ reply to class 2 student: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరా బెన్ (Heera ben) గత సంవత్సరం డిసెంబర్ 30న చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె మృతికి సంతాపం తెలియజేస్తూ బెంగళూరు చిన్నారి ప్రధాని (PM Modi)కి రాసిన లేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది.
PM Modi's ‘heartwarming’ reply to class 2 student: మాతృమూర్తి హీరాబెన్ ను కోల్పోయిన ప్రధాని మోదీ (PM Modi)ని ఓదారుస్తూ బెంగళూరు కు చెందిన రెండో తరగతి విద్యార్థి ఆరుష్ శ్రీవత్స (Aarush Srivatsa) రాసిన లేఖ, దానికి ప్రధాని మోదీ ఇచ్చిన జవాబు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ రెండు లేఖలను బీజేపీ (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) ట్విటర్ లో పోస్ట్ చేశారు. రెండో తరగతి చిన్నారికి ప్రధాని (PM Modi) స్వయంగా సమాధానం ఇవ్వడం భవిష్యత్ తరాల మనస్సులపై చెరగని ముద్ర వేస్తుందని ఖుష్బూ వ్యాఖ్యానించారు.
Class 2 student writes a condolence letter to PM: ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తాను
బెంగళూరులోని ఎంఈఎస్ కిషోర కేంద్ర స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న ఆరుష్ శ్రీ వత్స (Aarush Srivatsa) ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మరణ వార్తను టీవీలో చూశాడు. మోదీకి తన సంతాపం తెలియజేయాలనుకున్నాడు. వెంటనే ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ‘మీ అమ్మగారి మరణవార్త టీవీలో చూసి చాలా బాధపడ్డాను. తల్లిని కోల్పోయిన మీ బాధను నేను కూడా పంచుకుంటున్నాను. మీకు మన:స్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తున్నాను. మీ మాతృమూర్తి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తాను’ అని ఆరుష్ (Aarush Srivatsa) ఆ లేఖలో పేర్కొన్నారు.
PM Modi's ‘heartwarming’ reply to class 2 student: ప్రధాని స్పందన
ఈ లేఖకు ప్రధాని కార్యాలయం నుంచి Aarush Srivatsa కు జనవరి 25 న రిప్లై వచ్చింది. ఆ చిన్నారి చూపిన కరుణ తనను కదిలించి వేసిందని ఆ రిప్లైలో ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. అలాంటి ప్రేమ పూర్వక స్పందనలు తల్లిని కోల్పోయిన బాధను దిగమింగడానికి తనలో మరింత శక్తిని, ధైర్యాన్ని ఇస్తాయని అన్నారు. ‘మా అమ్మగారి మృతికి సంతాపం తెలుపుతూ నీవు రాసిన లేఖ నన్ను కదిలించివేసింది. తల్లిని కోల్పోవడం ఎవరికైనా తీర్చలేని లోటు. ఆ బాధను మాటల్లో చెప్పలేం. మీ ఆలోచనల్లో, మీ ప్రార్థనల్లో నన్ను కూడా చేర్చినందుకు ధన్యవాదాలు’ అని ప్రధాని మోదీ (PM Modi) ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు లేఖలను బీజేపీ (BJP) లీడర్, నటి ఖుష్బూ (Khushbu Sundar) ట్విటర్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. చిన్నపిల్లవాడికైనా సరే, ప్రధానే (PM Modi) స్వయంగా సమాధానమివ్వడం నెటిజన్లను కదిలించివేసింది. వారు తమ కామెంట్లలో ప్రధాని (PM Modi) పై ప్రశంసలు వర్షం కురిపించారు.
టాపిక్