Viral: ఆశ్చర్యం! 9 నెలల గర్భంతో మైలుదూరం పరిగెత్తిన మహిళ.. 5 నిమిషాల 17 సెకన్లలోనే..
Nine Months Pregnant ran a Mile: 5 నిమిషాల 17 సెకన్లలో మైలు దూరం పరుగెత్తారు ఓ నిండు గర్భిణి. ఈ విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాలివే..
Nine Months Pregnant ran a Mile: తొమ్మిది నెలల గర్భంతో ఉన్న వారు సాధారణంగా అయితే విశ్రాంతి తీసుకుంటుంటారు. కష్టమైన పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. అయితే, మెకెన్న మైలర్ (Mekenna Myler) అనే మహిళ మాత్రం పరుగు పోటీలో సత్తాచాటారు. ప్రొఫెషనల్ అథ్లెట్ అయిన ఆమె ఓ పోటీలో తొమ్మిది నెలల గర్భంలో మైలు దూరం ఆగకుండా పరుగెత్తారు. వివరాలివే..
Nine Months Pregnant ran a Mile: కాలిఫోర్నియాలో జరిగిన ఓ ట్రాక్ మీట్‍లో మెకెన్న మైలర్.. ఇలా 9 నెలల గర్భంతో పరుగెత్తారు. కేవలం 5 నిమిషాల 17 సెకన్లలోనే మైలు దూరాన్ని పూర్తి చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
30ఏళ్ల మైలర్.. మిడిల్ డిస్టెన్స్ రన్నర్‌గా ఉన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి కూడా ఆమె ప్రాక్టీస్‍ను అసలు ఆపలేదు. మూడేళ్ల క్రితం తాను తొలిసారి గర్భం దాల్చినప్పుడు కూడా ఆమె ఇలా పరుగు పందెంలో పాల్గొన్నాారు. అయితే అప్పటి కంటే ఇప్పుడే వేగంగా లక్ష్యాన్ని చేరి తన రికార్డును ఆమె మెరుగుపరుచుకున్నారు.
అప్పుడలా.. ఇప్పడిలా..
Nine Months Pregnant ran a Mile: 2020లో తన తొలి ప్రెగ్నెన్సీ సమయంలోనూ పోటీలో పాల్గొన్నారు మెకన్న మైలర్. అప్పుడు మైలు దూరాన్ని 5 నిమిషాల 25 సెకన్లలో పూర్తి చేశారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె పేరు మార్మోగింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఆమె మరోసారి 9 నెలల గర్భంతో పరుగెత్తారు. ఈసారి 5 నిమిషాల 17 సెకన్లలోనే మైలు దూరాన్ని పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత వ్యక్తిగత రికార్డును ఆమె మెరుగుపరుచుకున్నారు.
“ప్రెగ్నెన్సీ సమయంలో ప్రాక్టీస్ చేయడం సాధారణమేనని నేను అనుకున్నా. అయితే చాలా మంది ఇది అసాధారణంగా భావించారు. తొమ్మిది నెలల గర్భం ఉన్నప్పుడు తాము కనీసం సోఫా నుంచి దిగలేకున్నామని, మీరు ఎలా పరిగెత్తారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అయితే ప్రెగ్నెంట్ అయ్యే ముందు మీ శరీరం ఎలా ఉందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. నేను గర్భం దాల్చక ముందు నుంచి రన్నింగ్ చేస్తూనే ఉన్నా. ఇది నాకు తోడ్పడింది” అని మెకన్న మైలర్ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితిలో ఇంత కష్టమైన రేస్ చేయకుండా ఉండాల్సిందని కూడా తనకు కొందరు సూచిస్తున్నారని ఆమె చెప్పారు.