IPPB recruitment 2023: పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి-ippb recruitment 2023 apply for 132 executives posts at ippbonlinecom ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ippb Recruitment 2023: పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

IPPB recruitment 2023: పోస్టల్ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

HT Telugu Desk HT Telugu
Jul 28, 2023 02:12 PM IST

IPPB recruitment 2023: ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల నియామకాల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ippbonline.com వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IPPB recruitment 2023: ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల నియామకాల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ippbonline.com వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

vacancy details: వేకెన్సీ వివరాలు, లాస్ట్ డేట్

ఈ నోటిఫికేషన్ ద్వారా ఐపీపీబీ మొత్తం 132 ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లను భర్తీ చేయనుంది. దరఖాస్తుల దాఖలుకు ఆఖరు తేదీ ఆగస్ట్ 16. ఆ తేదీలోపు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ippbonline.com వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయో పరిమితి మినహాయింపులు వర్తిస్తాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికిి అర్హులు.

selection process: సెలెక్షన్ ఇలా..

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఆన్ లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు పరీక్షల్లో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికిి అభ్యర్థులు రూ. 300 అప్లికేషన్ ఫీ చెల్లంచాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ. 100 చెల్లించాలి.

How to apply: అప్లై చేయడం ఎలా?

  • అభ్యర్థులు ముందుగా ఐపీపీబీ అధికారిక వెబ్ సైట్ ippbonline.com ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపిస్తున్న Careers ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • అక్కడ కనిపించే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల రిక్రూట్ మెంట్ కు సంబంధించిన లింక్ పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
  • నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, యూపీఐ ల్లో ఏదో ఒక విధానంలో అప్లికేషన్ ఫీ చెల్లించి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
  • Notification here

Whats_app_banner