Infosys | నిమిషాల్లో రూ. 40వేల కోట్ల నష్టం.. ఈ స్టాక్​ పరిస్థితేంటి?-infosys investors lose over 40 000 crore in minutes ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Infosys | నిమిషాల్లో రూ. 40వేల కోట్ల నష్టం.. ఈ స్టాక్​ పరిస్థితేంటి?

Infosys | నిమిషాల్లో రూ. 40వేల కోట్ల నష్టం.. ఈ స్టాక్​ పరిస్థితేంటి?

HT Telugu Desk HT Telugu
Apr 18, 2022 03:49 PM IST

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఇన్ఫోసిస్​ షేర్లు దారుణంగా పతనమయ్యాయి. ఒకానొక దశలో నిమిషాల వ్యవధిలో రూ. 40వేల కోట్ల నష్టం వాటిల్లింది. మరి ఇప్పుడు ఈ స్టాక్​ పరిస్థితేంటి? ఇక్కడ కొనుగోలు చేయవచ్చా?

<p>ఇన్ఫోసిస్​</p>
ఇన్ఫోసిస్​ (REUTERS)

Infosys share price | ఇన్ఫోసిస్​ షేర్లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో 7శాతం మేర పతనమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరుచుకున్న కొద్ది నిమిషాల్లోనే.. పెట్టుబడిదారులు రూ. 40వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. మొత్తం ఐటీ సెక్టార్​ స్టాక్స్​పై ఈ ప్రభావం పడింది. ఐటీ సూచీ ఏకంగా 4శాతం మేర నష్టపోయింది.

త్రైమాసిక ఫలితాలతో డీలా..

2022 ఆర్థిక ఏడాది 4వ త్రైమాసికంలో ఇన్ఫోసిస్​.. అంచనాలకు తగ్గట్టు ఫలితాలు డెలివరీ చేయలేకపోవడమే ఈస్థాయి పతనానికి కారణం. దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సర్వీసు సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇన్ఫోసిస్​.. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. నికర లాభం 12శాతం పెరిగింది. రెవెన్యూ 23శాతం పెరిగింది. ఇవి అంచనాల కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో సంస్థ మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. థర్డ్​ పార్టీ వ్యయాలు విపరీతంగా పెరిగిపోవడం ఇందుకు ఓ కారణం.

గత ట్రేడింగ్​ సెషన్​లో 1,749 వద్ద ముగిసిన ఇన్ఫీ.. సోమవారం ఏకంగా 1,605 వద్ద తెరుచుకుంది. అప్పటికే మదుపర్లు వేల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. ఇక రోజంతా ఈ సంస్థ షేరు భారీ నష్టాల్లోనే ట్రేడ్​ అయ్యింది. చివరికి 1,622 వద్ద స్థిరపడింది. మొత్తం మీద 126పాయింట్ల నష్టాన్ని(7.22శాతం) ఇన్ఫోసిస్​ మూటగట్టుకుంది.

కాగా.. ఇన్ఫోసిస్​ అనేది చాలా మంచి ఫండమెంటల్స్​ ఉన్న కంపెనీ. పైగా పరిస్థితులపై సంస్థ కీలక వ్యాఖ్యలు సైతం చేసింది. పెద్ద పెద్ద డీల్స్​ వస్తున్నాయని, వ్యాపారానికి నష్టం లేదని పేర్కొంది.

అందువల్ల.. తాజా పరిస్థితులు స్వల్పకాలానికే అని, భవిష్యత్తులో స్టాక్​ మళ్లీ పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రేటింగ్​ సంస్థలు.. ఈ స్టాక్​కు బై రేటింగ్​ ఇస్తూ.. 12నెలల కాలానికి రూ. 2,426 టార్గెట్​ని కూడా ఇస్తున్నాయి.

మరికొన్ని రేటింగ్​ సంస్థలు మాత్రం.. ఇన్ఫోసిస్​ షేరు టార్గెట్లను భారీగా తగ్గిస్తున్నాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన వార్త మాత్రమే. ఎలాంటి పెట్టుబడులైనా పెట్టే ముందు.. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించడం శ్రేయస్కరం. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్