Crime news: ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో కట్ చేసి ఉన్న మనిషి వేలు-human finger found in ice cream cone ordered from mumbai shop ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో కట్ చేసి ఉన్న మనిషి వేలు

Crime news: ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో కట్ చేసి ఉన్న మనిషి వేలు

HT Telugu Desk HT Telugu
Jun 13, 2024 01:25 PM IST

ఒక మహిళా వైద్యురాలికి ఐస్ క్రీమ్ తినాలనిపించి, ఆన్ లైన్ లో ఒక ఐస్ క్రీమ్ కోన్ కు ఆర్డర్ ఇచ్చింది. కాసేపటికి కోన్ డెలివరీ తీసుకుని.. ఓపెన్ చేయగానే అందులో కట్ చేసి ఉన్న మనిషి వేలు కనిపించింది. దాంతో, ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ఆ డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

ఐస్ క్రీమ్ లో తెగిపోయి ఉన్న మనిషి వేలు
ఐస్ క్రీమ్ లో తెగిపోయి ఉన్న మనిషి వేలు (Pixabay)

ఒక మహిళా వైద్యురాలికి ఐస్ క్రీమ్ తినాలనిపించి, ఆన్ లైన్ లో ఒక ఐస్ క్రీమ్ కోన్ కు ఆర్డర్ ఇచ్చింది. కాసేపటికి కోన్ డెలివరీ తీసుకుని.. ఓపెన్ చేయగానే అందులో కట్ చేసి ఉన్న మనిషి వేలు కనిపించింది. దాంతో, ఒక్కసారిగా భయాందోళనలకు గురైన ఆ డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.

పోలీసులకు ఫిర్యాదు

ముంబైలోని ఓ దుకాణం నుంచి ఒక మహిళా డాక్టర్ ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో మానవ వేలి ముక్క కనిపించింది. వెంటనే ఆ డాక్టర్ సమీపంలోని మలాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం ఆ మహిళ యమ్మో ఐస్ క్రీం కంపెనీ (Yummo ice cream company) నుంచి ఐస్ క్రీమ్ కోన్ ను ఆర్డర్ చేసింది. ఆ ఐస్ క్రీమ్ కోన్ ను విప్పి చూడగా అందులో తెగిపోయిన, గడ్డ కట్టి ఉన్న మానవ వేలు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. వెంటనే తేరుకుని సమీపంలోని మలాడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు యమ్మో ఐస్ క్రీమ్స్ కంపెనీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐస్ క్రీమ్ లో లభించిన వేలును ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. తదుపరి దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Whats_app_banner