Uttarakhand town sinking: నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోతున్న పట్టణం
ఉత్తరాఖండ్ లోని పవిత్ర జోషి మఠ్ పట్టణం క్రమంగా కుంగిపోతోంది. ఇళ్లు, రోడ్లపై పగుళ్లు ఏర్పడుతున్నాయి.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషి మఠ్ (Joshimath) క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవతున్నారు.
Joshimath town sinking: భౌగోళిక మార్పుల వల్లనే
భౌగోళిక మార్పులు, అభివృద్ధి పేరుతో చేపట్టిన కార్యక్రమాల వల్లనే Joshimath ఈ కుంగుబాటు ప్రారంభమైందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జోషి మఠ్ పట్టణంలోని సుమారు 561 గృహాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. 29 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 500 కుటుంబాలు ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు. పట్టణంలోని సింగ్ధర్, మార్వాడీ వార్డుల్లోని పలు ప్రాంతాలు క్రమంగా నిట్టనిలువుగా భూమిలోకి కుంగిపోవడం కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ప్రజలు తమ ఇళ్లకు వెదురు కర్రలతో ఊతం ఇవ్వడం కనిపిస్తోంది. మొత్తంగా Joshimath పట్టణంలోని 10 వార్డుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో, తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.
Joshimath town sinking: త్వరలో సీఎం పర్యటన
జోషి మఠ్ ను త్వరలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సందర్శించనున్నారు. భూమి కుంగుతున్న సమస్యను స్వయంగా పరిశీలించనున్నారు. ఇప్పటికే ఆయన జోషిమఠ్ మున్సిపల్ చైర్మన్ శైలేంద్ర పవార్ తో మాట్లాడి, సహాయ చర్యలను ప్రారంభించాల్సిందిగా సూచించారు. ఐఐటీ రూర్కీ కి చెందిన నిపుణుల బృందం జోషి మఠ్ (Joshimath) ను సందర్శించి, సమస్యపై అధ్యయనం చేసింది. చమోలి జిల్లా జాయింట్ కలెక్టర్ దీపక్ సైని జోషిమఠ్ లోనే మకాం వేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Joshimath town sinking: ప్రమాదంలో పట్టణం
హిమాలయ పర్వత పాద ప్రాంతంలో ఉన్న ఈ పట్టణానికి భూకంపాల ముప్పు కూడా ఉంది. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కు ఈ పట్టణం 300 కిమీల దూరంలో ఉంటుంది. చాలామంది హిమాలయ పర్వతారోహకులు ఇక్కడి నుంచే తమ ప్రయాణం ప్రారంభిస్తారు. అలాగే, బద్రీనాథ్, హేమకుండ్ సాహెబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు ఈ జోషిమఠ్ (Joshimath) గేట్ వే వంటింది. ఇక్కడే ప్రముఖ జ్యోతి మఠ్ కూడా ఉంది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంగా ఉన్న కంటోన్మోంట్ కూడా ఇక్కడే ఉంది. జాతీయ రహదారి 7(NH7)కు సమీపంలో 6150 అడుగుల ఎత్తున ఈ జోషిమఠ్ (Joshimath) ఉంటుంది.
టాపిక్