Yellow alert for Bengaluru: బెంగళూరుకు మళ్లీ వర్షం ముప్పు-heavy rain likely in karnataka yellow alert for bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yellow Alert For Bengaluru: బెంగళూరుకు మళ్లీ వర్షం ముప్పు

Yellow alert for Bengaluru: బెంగళూరుకు మళ్లీ వర్షం ముప్పు

HT Telugu Desk HT Telugu
Oct 11, 2022 10:07 PM IST

Yellow alert for Bengaluru: కర్నాటకను, ముఖ్యంగా బెంగళూరును వరుణ దేవుడు వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో బుధవారం మళ్లీ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.

<p>బెంగళూరులో వర్షం</p>
బెంగళూరులో వర్షం (Raj K Raj/HT Photo)

Yellow alert for Bengaluru: కర్నాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. తాజాగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, బెలగావి, బీదర్, ధార్వాడ్, గడగ్, కలబురిగి, రాయిచూర్, కొడగు, శివమొగ్గ సహా దాదాపు రాష్ట్రమంతా రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Yellow alert for Bengaluru: బెంగళూరుకు యెల్లో అలర్ట్

బెంగళూరు నగర ప్రజలకు కూడా ప్రత్యేక హెచ్చరికలను వాతావరణ శాఖ, కర్నాటక నేచురల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్ జారీ చేశాయి. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించాయి. లోతట్లు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరకోవాలని సూచించాయి. బెంగళూరు నగర ప్రజలు అవసరమైతేనే, బయటకు రావాలని సూచించింది.

Yellow alert for Bengaluru: పాండవపురలో అత్యధికం..

కర్నాటకలో మంగళవారం అత్యధిక వర్షపాతం పాండవపుర తాలూకాలోని నారాయణ పురలో 128 మిమీలు, హసన్ జిల్లాలోని అర్కాల గూడలో 123 మిమీ, మైసూరు జిల్లా కృష్ణరాజనగర్ లో 116.5 మిమీల వర్షపాతం నమోదైంది.

Whats_app_banner