Gas Cylinder expiry date : గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది! ఇలా చెక్​ చేసుకోండి..-doe gas cylinders have expiry date yes and this is how you can check ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gas Cylinder Expiry Date : గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది! ఇలా చెక్​ చేసుకోండి..

Gas Cylinder expiry date : గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది! ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Nov 13, 2023 11:58 AM IST

Gas Cylinder expiry date : గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని మీకు తెలుసా? ఇలా చెక్​ చేసుకోండి.

గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది!
గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది! (PTI)

Gas Cylinder expiry date in Telugu : చాలా వస్తువులను.. ఎక్స్​పైరీ డేట్​ చూసే కొంటాము. కానీ కొన్ని వస్తువుల విషయంలో దానిని పట్టించుకోము. ఏళ్ల తరబడి వాడేస్తూ ఉంటాము. లేదా ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాము. వీటిల్లో గ్యాస్​ సిలిండర్​ ఒకటి. కానీ.. గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. మనం వంటకు వాడే ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ అనేది ఉంటుంది. దానిని ఎలా తెలుసుకోవాలి? అనే విషయంపై రూపొందించిన ఓ వీడియో.. ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇలా చెక్​ చేసుకోండి..

వైరల్​ వీడియోలో.. గ్యాస్​ సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్​ గురించి ఓ వ్యక్తి స్పష్టంగా వివరించాడు. సిలిండర్​ని పట్టుకునే భాగానికి లోపల.. కొన్ని పదాలు, నెంబర్లు రాసి ఉంటాయి. వాటిని డీకోడ్​ చేసి మనం సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్​ని తెలుసుకోవచ్చు.

How to check Gas Cylinder expiry date : ఒక ఉదాహరణతో దీనిని మనం అర్థం చేసుకుందాము. సిలిండర్​ మీద “ఏ-26” అని రాసి ఉందనుకుందాము. ఏ అనేది సిలిండర్​ ఎక్స్​పైరీ అవుతున్న నెలకు సంబంధించింది. 26 అనేది ఏ ఏడాదిలో ఎక్స్​పైర్​ అవుతుంది? అన్న విషయాన్ని చెబుతుంది.

  • ఏ అంటే జనవరి నుంచి మార్చ్​ వరకు.
  • బీ అంటే ఏప్రిల్​ నుంచి జూన్​ వరకు.
  • సీ అంటే జులై నుంచి సెప్టెంబర్​ వరకు
  • డీ అంటే అక్టోబర్​ నుంచి డిసెంబర్​ వరకు.

ఒకవేళ "సీ-27" అని సిలిండర్​ మీద రాసి ఉంటే.. ఆ గ్యాస్​ సిలిండర్​.. 2027 జులై- సెప్టెంబర్​ మధ్యలో ఎక్స్​పైర్​ అవుతుంది. ఈ విధంగా.. ఒక సిలిండర్​ని కొనే ముందు.. దాని ఎక్స్​పైరీ డేట్​ని చూసుకోవచ్చు.

Gas Cylinder expiry date : చాలా మందికి.. ఒక సిలిండర్​నే ఎక్కువ సంవత్సరాలు వాడి అలవాటు ఉంటుంది. గ్యాస్​ అయిపోతే.. ఆ సిలిండర్​లోనే రీఫిల్​ చేసుకుంటారు. కొన్ని నెలల పాటు ఇలా చేస్తే ఓకే కానీ.. ఏళ్ల తరబడి ఇదే ఫాలో అయితే.. సిలిండర్​ ఎక్స్​పైర్​ అయిపోయిన తర్వాత.. లీకేజ్​ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సిలిండర్​ ఎక్స్​పైరీ డేట్​ని తెలుసుకోవాలి.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

Whats_app_banner

సంబంధిత కథనం