Cyclone Sitrang : తీరం దాటిన ‘సిత్రంగ్’​.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!-cyclone sitrang kills 7 as it make landfall in bangladesh thousands evacuated ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Sitrang : తీరం దాటిన ‘సిత్రంగ్’​.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!

Cyclone Sitrang : తీరం దాటిన ‘సిత్రంగ్’​.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 25, 2022 07:15 AM IST

Cyclone Sitrang landfall : బంగ్లాదేశ్​లో సిత్రంగ్​ తుపాను తీరం దాటింది. ఇప్పటికే ఏడుగురి ప్రాణాలు తీసింది.

తీరం దాటిన ‘సిత్రంగ్’​.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!
తీరం దాటిన ‘సిత్రంగ్’​.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!

Cyclone Sitrang landfall : తీరం దాటుతూనే.. సిత్రంగ్​ తుపాను బంగ్లాదేశ్​లో తీవ్ర అలజడులు సృష్టించింది. తుపాను ధాటికి ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. తుపాను నేపథ్యంలో వేలాది మంది ప్రజలు, పశువులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఈ తుపానుకు సిత్రంగ్​ అని పేరు పెట్టింది థాయ్​లాండ్​. బంగ్లాదేశ్​లోని టింకోనా ద్వీపం- సంద్వీప్​ మధ్యలో సోమవారం అర్ధరాత్రి- మంగళవారం తెల్లవారుజామున సమయంలో సిత్రంగ్​ తుపాను తీరం దాటినట్టు సమాచారం.

Cyclone Sitrang live updates : తుపాను తీరాన్ని ధాటిన అనంతరం భారీ వర్షాలు.. బంగ్లాదేశ్​ను గడగడలాడించాయి. వేగంగా వీస్తున్న గాలులు భయపెట్టాయి. మొత్తం మీద 28,155మంది ప్రజలు, 2,736 పశువులను.. కాక్స్​ బజార్​ తీర ప్రాంతం నుంచి 576 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైతే ఉపయోగించుకునేందుకు.. సమీపంలోని స్కూళ్లు, కళాశాలలను కూడా అధికారులు సిద్ధం చేశారు.

తుపాను నేపథ్యంలో ఓ కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేశారు అధికారులు. సాయం కోసం ప్రజలు కంట్రోల్​ రూమ్​ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

సిత్రంగ్​ తుపానును ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్​ ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. ఎమర్జెన్సీ కోసం 104 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. 323 టన్నుల బియ్యం, 400 కార్టన్ల బిస్కెట్లు, 1,198 ప్యాకేజీలు డ్రై ఫుడ్​తో పాటు ఇతర ఆహార పదార్థాలను సిద్ధం చేసింది.

భారత్​లో భారీ వర్షాలు..

Cyclone Sitrang latest news India : బంగ్లాదేశ్​లో సిత్రంగ్​ తుపాను తీరం దాటడంతో.. పశ్చిమ్​ బెంగాల్​తో పాటు ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ఇప్పటికే మంగళవారం సెలవును ప్రకటించారు.

ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

సిత్రంగ్​ తుపాను నేపథ్యంలో అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురకు రెడ్​ అలర్ట్​ జారీ చేసింది ఐఎండీ. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

బంగ్లాదేశ్​తో సరిహద్దును పంచుకుంటున్న మేఘాలయలో తుపాను ప్రభావం కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఫలితంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్​ ప్రకటించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం