CUET UG 2022 answer key: సీయూఈటీ యూజీ 2022 ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
CUET UG 2022 answer key: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీయూఈటీ యూజీ 2022 ఆన్సర్ కీ విడుదల చేసింది.
CUET UG 2022 answer key: సీయూఈటీ యూజీ 2022 ఆన్సర్ కీ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ ఆన్సర్ కీని విడుదల చేసింది.
సీయూఈటీ యూజీ 2022 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.in లో లాగిన్ అయి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో నింపిన జవాబుప్రతిని కూడా వెబ్‌సైట్‌లో ఎన్టీఏ అందుబాటులో ఉంచుతుంది. దీని ఆధారంగా అభ్యర్థులు తమ మార్కులను కాలుక్యులేట్ చేసుకోవచ్చు.
సీయూఈటీ యూజీ అన్సర్ కీని అప్లికేషన్ నెంబర్, జన్మదిన తేదీని వినియోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జూలై, ఆగస్టు మాసాల్లో 6 విడుతలుగా ఈ పరీక్ష నిర్వహించారు.
కాగా అభ్యర్థులు ప్రొవిజనల్ ఆన్సర్ కీపై తమ స్పందనలను తెలపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
సీయూఈటీ యూజీ 2022 ఆన్సర్ కీ ఇలా చెక్ చేయండి..
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 2: సీయూఈటీ యూజీ 2022 ఆన్సర్ కీ లింక్ వెతకండి
స్టెప్ 3: CUET UG 2022 Answer Key link క్లిక్ చేయండి
స్టెప్ 4: లాగిన్ డీటైల్స్ సబ్‌మిట్ చేయండి.
స్టెప్ 5: ఆన్సర్ కీ, మీ ఆన్సర్ రెస్పాన్సెస్ చూడండి.
టాపిక్