Karnataka elections : 'ఉచిత విద్యుత్.. ఉచిత రవాణా'- కర్ణాటకలో కాంగ్రెస్ హామీల వర్షం!
Karnataka elections : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటి అంశాలను మేనిఫెస్టోలో పేర్కొంది.
Congress Manifesto for Karnataka elections : త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. తాము ప్రభుత్వంలోకి వస్తే.. ఉచిత విద్యుత్, మహిళలకు నగదు- ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి వంటివి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు మేనిఫెస్టోను విడుదల చేసింది.
కర్ణాటకలో మంగళవారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు..
- Karnataka elections 2023 : ప్రభుత్వం తరఫు నుంచి ఉచితంగా 200 యునిట్ల విద్యుత్
- కుటంబ పెద్దగా ఉండే ప్రతి మహిళకు నెలకు రూ. 2వేల నగదు పంపిణీ.
- నిరుద్యోగ గ్రాడ్జ్యువేట్స్కు నెలకు రూ. 3వేలు(రెండేళ్ల వరకు). డిప్లామా హోల్డర్స్‌కు నెలకు రూ. 1,500 (రెండేళ్ల వరకు).
- Karnataka elections Congress Manifesto : కేఎస్ఆర్టీసీ/ బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం.
- ఎన్ఈపీ (జాతీయ విద్యా విధానం)ని తిరస్కరించేందుకు రాష్ట్ర విద్యా విధానాన్ని ఏర్పాటు చేయడం.
- 2006లో సర్వీసులో చేరి, పింఛనుకు అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పొడిగింపుపై ఆలోచించడం
- Karnataka Congress latest news : ప్రభుత్వ విభాగాల్లో ఇప్పటివరకు ఆమోదించని వేకెన్సీలను ఏడాదిలోపు భర్తీ చేయడం.
- సముద్రంలో చేపల వేట కోసం ప్రతియేటా 500 లీటర్ల ట్యాక్స్ ఫ్రీ డీజిల్ అందజేత.
- లీన్ పీరియడ్ అలోవెన్స్ కింద మత్స్యకారులకు రూ. 6000 అందజేత.
- కేజీకి రూ.3 చొప్పున ఆవు పేడ కొనుగోలు. మేన్యూర్ సెంటర్ల ఏర్పాటు.
- Karnataka Congress manifesto : నైట్ డ్యూటీలో ఉండే పోలీసు అధికారులకు నెలకు రూ. 5వేల స్పెషల్ అలోవెన్స్. ప్రతి యేటా ఒక నెల జీతం ఎక్కువగా ఇవ్వడం.
- ఆర్డర్లు ఇచ్చిన 90రోజుల్లోపు పని మొదలుపెట్టడం, నిర్దేశిత సమయంలో పూర్తి చేయడం. కాంట్రాక్ట్ బిల్లులు సకాలంలో పూర్తి చేయడం.
- Congress manifesto in Telugu : బజ్రంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలను నిషేధించే విధంగా నిర్ణయం తీసుకోవడం.
- ఎస్సీ రిజర్వేషన్‌ను 15శాతం నుంచి 17శాతానికి పెంచడం. ఎస్టీ రిజర్వేషన్‌ను 3శాతం నుంచి 7శాతానికి పెంచడం. మైనారిటీ రిజర్వేషన్‌ను 4శాతానికి పునరుద్ధరించడం. లింగాయత్‌లు, వొక్కలిగ్గాలు, ఇతర సంఘాల సభ్యులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రచారం చేయడం.
కర్ణాటక ఎన్నికలు..
2023 Karnataka elections schedule : 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బయటకొచ్చిన కొన్ని సర్వేలు.. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వేలు.. హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నాయి.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. సోమవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం