Karnataka elections : ‘ఉచితంగా గ్యాస్ సిలిండర్లు- ఉమ్మడి పౌరస్మృతి అమలు’.. బీజేపీ మేనిఫెస్టో
BJP manifesto for Karnataka elections : కర్ణాటక ఎన్నికల వేళ అధికార బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతరులు పాల్గొన్నారు.
BJP manifesto for Karnataka elections : 2023 కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార బీజేపీ. బెంగుళూరు వేదికగా సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేనిఫెస్టోను 'విజన్ డాక్యుమెంట్'గా అభివర్ణిస్తోంది కమలదళం.
ఈ ఈవెంట్లో జేపీ నడ్డాతో పాటు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం బీఎస్ యడియూరప్పతో పాటు పలువురు కీలక నేతలు సైతం పాల్గొన్నారు.
బీజేపీ మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు..
- కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) అమలు- దీని కోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. దాని సిఫార్సులను పరిగణలోకి తీసుకుని యూసీసీని అమలు చేస్తారు.
- BJP Karnataka elections : కర్ణాటక రెసిడెంట్స్ వెల్ఫేర్ కన్సల్టేటివ్ కమిటీని ఏర్పాటు చేయడం- ఫలితంగా.. బెంగళూరులో నివాసం ఉంటున్న వారి సౌలభ్యాన్ని మెరుగుపరచడం.
- దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న కుటుంబాలకు వార్షికంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం- ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఇవి ఉచితంగా పంపిణీ చేస్తారు.
- BJP manifesto Karnataka : దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్న వారి కోసం 'పోషన' పథకం అమలు- ఇందులో భాగంగా ప్రతి నెల రేషిన్ కిట్స్‌తో అర లీటర్ నందిని మిల్క్, 5 కేజీల శ్రీ అన్న- శ్రీ ధాన్యం ఇస్తారు.
- ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం.
- కర్ణాటకను ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) హబ్‌గా అభివృద్ధి చేయడం.
సమాజంలోని అన్ని వర్గాలకు చేరువయ్యే విధంగా తమ మేనిఫెస్టోను రూపొందించినట్టు బీజేపీ పేర్కొంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చినట్టు స్పష్టం చేసింది.
"ఏసీ రూముల్లో కూర్చుని తయారు చేసిన మేనిఫెస్టో కాదు ఇది. రాష్ట్ర నలుమూలలకు మా కార్యకర్తలు వెళ్లారు. చాలా శ్రమించి ప్రజల అవసరాలను తెలుసుకున్నారు. ఈ విధంగా పుట్టుకొచ్చిందే ఈ మేనిఫెస్టో," అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
కర్ణాటకలో త్రిముఖ పోరు..?
Karnataka elections 2023 schedule : 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. అయితే అనేక సర్వేల ప్రకారం.. కాంగ్రెస్ ముందంజలో ఉంది! కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరికొన్ని హంగ్ ఏర్పడుతుందని అంచనా వేస్తున్నాయి.
కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉంది.
సంబంధిత కథనం