China covid news : అటు కొవిడ్​ కేసులు- ఇటు నిరసనలు.. గడగడలాడుతున్న చైనా!-china sees new record surge hit by anti covid protests all you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  China Covid News : అటు కొవిడ్​ కేసులు- ఇటు నిరసనలు.. గడగడలాడుతున్న చైనా!

China covid news : అటు కొవిడ్​ కేసులు- ఇటు నిరసనలు.. గడగడలాడుతున్న చైనా!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 27, 2022 01:33 PM IST

China covid cases : కొవిడ్​ కేసులతో గడగడలాడుతున్న చైనాలో ప్రజల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీరో కొవిడ్​ పేరుతో ఉన్న కఠిన ఆంక్షలను తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

కొవిడ్​ పరీక్ష కోసం క్యూలో నిల్చున్న బీజింగ్​వాసులు..
కొవిడ్​ పరీక్ష కోసం క్యూలో నిల్చున్న బీజింగ్​వాసులు.. (AP)

China covid cases : చైనాపై కొవిడ్​ మహమ్మారి మరోమారు పంజా విసురుతోంది! దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కొవిడ్​ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం విధిస్తున్న కొవిడ్​ ఆంక్షలతో విసుగెత్తిపోయిన ప్రజలు.. రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ పరిణామాలతో చైనా గడగడలాడుతోంది.

yearly horoscope entry point

కొవిడ్​ కేసులు..

చైనాలో తాజాగా 39,791 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటిల్లోని 26,943 కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అంతకుముందు రోజు.. చైనాలో 32,943 కేసులు బయటపడ్డాయి. వాటిల్లో 29,840 కేసుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. తాజా లెక్కల ప్రకారం.. చైనాలో లక్షణాలు ఉన్న కొవిడ్​ కేసుల సంఖ్య 3,07,802గా ఉంది.

China covid latest news : చైనాలో గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. జీరో కొవిడ్​ పాలసీని తీవ్రంగా అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చాలా చోట్లా.. రెస్టారెంట్లు, టూరిస్ట్​ ప్రదేశాలతో పాటు ఇతర ప్రాంతాలు ఆంక్షల వలయంలో ఉన్నాయి. తాజాగా.. షెన్​జెన్​ నగరం.. రెస్టారెంట్లపై ఆంక్షలు విధించింది. 50శాతం ఆక్యుపెన్సీని మించకూడదని స్పష్టం చేసింది. ఇక నగరంలోకి కొత్త వస్తున్న వారు.. తొలి మూడు రోజుల వరకు థియేటర్లు, జిమ్​ వంటి ప్రదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని పిలుపునిచ్చింది.

చైనా జీరో కొవిడ్​ పాలసీపై అక్కడి ప్రజలు విసుగెత్తిపోయినట్టు కనిపస్తోంది. కఠినమైన ఆంక్షలకు స్వస్తి చెప్పాలని, తమకు స్వేచ్ఛ కల్పించాలని ప్రజలు వేడుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో.. ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు.

అగ్నిప్రమాదంతో ఆగ్రహజ్వాలలు..

China Covid protests : గురువారం.. జిన్​జాంగ్​ రాష్ట్ర రాజధాని ఉరుమ్​కిలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం.. పాక్షిక లాక్​డౌన్​లో ఉండటంతో.. లోపల ఉన్న వారు సమయానికి బయటపడలేకపోయారని వార్తలు వచ్చాయి. ఈ ఘటనపై చైనావ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

షాంఘైలో శనివారం రాత్రి మొదలుపెట్టిన ఆందోళనలు.. ఆదివారం తెల్లవారుజామున వరకు కొనసాగాయి. ప్రజలు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.

China zero covid policy : "ఉరుమ్​కిలో లాక్​డౌన్​ను ఎత్తివేయండి. జిన్​జాంగ్​లో లాక్​డౌన్​ ఎత్తేయండి. చైనా మొత్తం మీద లాక్​డౌన్​ ఎత్తేయండి," అని ప్రజలు నినాదాలు చేస్తూ కనిపించారు.

"చైనా కమ్యూనిస్ట్​ పార్టీ డౌన్​.. డౌన్​! జిన్​పింగ్​ డౌన్​డౌన్​.. ఉరుమ్​కికి స్వేచ్ఛనివ్వండి," అంటూ కూడా ప్రజలు నిరసనలు తెలిపారు. ప్రజలను నియంత్రించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం